ఆవిర్భావ సభ.. జనసేనను డిఫెన్స్‌లోకి నెట్టిందా.? ఆ ప్రశ్నలు దేనికి సంకేతం.!

జనసేన పార్టీ ఏర్పాటై 12 ఏళ్లు సందర్భాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో భారీ బహిరంగ సభను ఆ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సభకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. అయితే, ఈ సభ పూర్తయిన తరువాత అనేక ప్రశ్నలు ఉత్పన్నం కావడంతోపాటు జనసేన పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేలా కొందరు వ్యాఖ్యలు దోహదం చేశాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీలో కీలక నేత, ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడిన మాటలు కూటమి నేతల్లో కాకరేపుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌ విజయానికి ఎవరూ దోహదం చేయలేదని, తామే కారణం అని ఎవరైనా భావిస్తే మాత్రం అది వారి ఖర్మ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయి.

Pawan Kalyan, Nagababu speaking at Chitrada

చిత్రాడ సభలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్, నాగబాబు

జనసేన పార్టీ ఏర్పాటై 12 ఏళ్లు సందర్భాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో భారీ బహిరంగ సభను ఆ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సభకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. అయితే, ఈ సభ పూర్తయిన తరువాత అనేక ప్రశ్నలు ఉత్పన్నం కావడంతోపాటు జనసేన పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేలా కొందరు వ్యాఖ్యలు దోహదం చేశాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీలో కీలక నేత, ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడిన మాటలు కూటమి నేతల్లో కాకరేపుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌ విజయానికి ఎవరూ దోహదం చేయలేదని, తామే కారణం అని ఎవరైనా భావిస్తే మాత్రం అది వారి ఖర్మ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలో పరోక్షంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్ధేశించి చేసినవిగా చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తలు, సోషల్‌ మీడియా కార్యకర్తలు కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పిఠాపురం వర్మ లేకపోతే 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో చూశారుగా అంటూ నాగబాబుకు కౌంటర్లు ఇస్తున్నారు. వర్మ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. వర్మ లోకల్‌ అని, అధికారం ఉన్నా, లేకపోయినా ఇక్కడే ఉంటానని, ఎవరో మాట్లాడిన మాటలను తాను పట్టించుకోనంటూ ఒకింత తీవ్రస్థాయిలోనే కౌంటర్‌ ఇచ్చారు.

మరో వైపు టీడీపీ శ్రేణులు కూడా సామాజిక మాధ్యమాల్లో జనసేన, నాగబాబును ఉద్ధేశించి అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఒక వైపు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూటమిలో కాక రేపుతుంటే.. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు కూడా జాతీయ స్థాయిలో తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. హిందీ భాషపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను డీఎంకే తీవ్రస్థాయిలో తప్పుబడుతోంది. ఇప్పటికే ప్రకాష్‌రాజ్‌ పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై తీవ్రస్తాయిలో స్పందించారు. జనసేన కాస్తా భజనసేనగా మారిందంటూ విమర్శించారు. మరోవైపు డీఎంకే నేతలు కూడా పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను విమర్శించడంతోపాటు గతంలో ఆయన హిందీపై చేసిన కామెంట్లు వీడియోలు, పేపర్‌ క్లిప్పింగ్‌లను బయటకు తీసి మరీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. అలాగే, మతాలు, కులాలు గురించి పవన్‌ కల్యాణ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు.. తాజాగా జనసేన ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలు వీడియోలను వైసీపీతోపాటు ఇతర పార్టీలకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలు విస్తృతంగా సర్క్యులేట్‌ చేస్తున్నారు. గతంలో తన తండ్రి గురించి పవన్‌ మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలను కంపేర్‌ చేస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారు. అలాగే, తాను అనేక ప్రాంతాల్లో పుట్టినట్టు పవన్‌ కల్యాణ్‌ చెప్పిన మాటలు, తాజాగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన మాటలను కౌంటర్‌ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా జనసేన ఆవిర్భావ సభ తరువాత అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన దుస్థితి, తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి జనసేనకు ఏర్పడింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్