సీఎం పీఠం వయా జైలు గోడలు.. దేశ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్

దేశ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్ని చేసినా ముఖ్య నేతలు జైలుకు వెళితే చాలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు అన్న పరిస్థితి దేశంలో ప్రస్తుతం కొనసాగుతోంది. గడచిన కొన్నాళ్లుగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పీఠాలను దక్కించుకున్న ఎంతోమంది నేతల చరిత్రను చూస్తే ఇదే రుజువు అవుతోంది. ప్రజా పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏదో ఒక కేసులో జైలుకు వెళ్ళు వస్తే చాలు ముఖ్యమంత్రి అవుతారు అన్న పరిస్థితి అనేక రాష్ట్రాల్లో నెలకొంది.

Hemant Soren, Chandrababu, Jagan

హేమంత్ సోరేన్, చంద్రబాబు, జగన్

దేశ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్ని చేసినా ముఖ్య నేతలు జైలుకు వెళితే చాలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చు అన్న పరిస్థితి దేశంలో ప్రస్తుతం కొనసాగుతోంది. గడచిన కొన్నాళ్లుగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పీఠాలను దక్కించుకున్న ఎంతోమంది నేతల చరిత్రను చూస్తే ఇదే రుజువు అవుతోంది. ప్రజా పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏదో ఒక కేసులో జైలుకు వెళ్ళు వస్తే చాలు ముఖ్యమంత్రి అవుతారు అన్న పరిస్థితి అనేక రాష్ట్రాల్లో నెలకొంది. ఇటువంటి వాతావరణం దేశ రాజకీయాల్లో రోజురోజుకు పెరుగుతుండడం గమనార్ధం. తాజాగా జార్ఖండ్ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన జేఎంఎం నేత హేమంత్ సోరేన్ విషయంలోనూ ఇదే రుజువయింది. ఈయన కూడా కొన్నాళ్ల కిందట జైలుకు వెళ్లి వచ్చి తాజాగా మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. హేమంత్ సోరేన్ భూ కుంభకోణం కేసులో ఈ ఏడాది జనవరి 31న ఈడి అరెస్టు చేసింది. అప్పటికే ముఖ్యమంత్రి అయిన హేమంత్ అరెస్టు ఆయన కాసేపటికి తన పదవికి రాజీనామా చేశారు. 149 రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. జూలై 4న తిరిగి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో జేఎంఎం ఆధ్వర్యంలోని ఇండియా కూటమి విజయం సాధించడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆయనే ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం కూడా చేయమన్నారు. ఇదే జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం గత ఏడాది అరెస్టు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత ఏడాది అరెస్టు అయినా చంద్రబాబు నాయుడు 53 రోజులపాటు జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. 2024 ఎన్నికల్లో టిడిపి కూటమి కనివిని ఎరుగని రీతిలో అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించి మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే జైలు జీవితం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రిని చేసింది. గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా విజయం సాధించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడుగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 2012 మే 27న సిబిఐ అరెస్టు చేసింది. సుమారు 16 నెలలపాటు జైలు జీవితం గడిపారు. 2014 ఎన్నికల్లో వైసీపీ 67 స్థానాల్లో గెలవడంతో ఏపీలో ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి అధికారాన్ని దక్కించుకుంది. జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు.

ఇదే జైలు జీవితం మరో నేతను కూడా ముఖ్యమంత్రిని చేసింది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా జైలు జీవితాన్ని అనుభవించిన తర్వాతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారు అనే ఆరోపణలతో 2020 మార్చి 5న పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజుల రిమాండ్ అనంతరం బెయిల్ పై విడుదలయ్యా. జైలు నుంచి విడుదలయ్యాక రేవంత్ రెడ్డి 2021 జూలైలో టిపిసిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదే కోవకు చెందుతారు తెలంగాణ ముఖ్య నేత డీకే శివకుమార్. మనీ లాండరింగ్ కేసులో 2019 సెప్టెంబర్ 3న ఈడి అరెస్టు చేసింది. ఢిల్లీ హైకోర్టు మెయిల్ ఇవ్వడంతో 2019 అక్టోబర్ 23న విడుదలయ్యారు. అనంతరం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఓమర్ అబ్దుల్లా కూడా జైలు జీవితం గడిపిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసిన నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాను కేంద్ర ప్రభుత్వం 232 రోజులపాటు గృహ నిర్బంధంలో ఉంచింది. 2019 ఆగస్టు ఐదు నుంచి 2020 మార్చి 24 దాకా ఓమర్ నిర్బంధంలో ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓమరు గెలుపొందిగా ఆయన పార్టీ ఎన్సీ మొత్తం 42 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. ఒమర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్