||కింగ్ ఫిషర్ Photo: Twitter||
జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ఓ వ్యక్తి జగిత్యాల వైన్ షాప్ లో కింగ్ ఫిషర్ బ్రాండ్ దొరకడం లేదని కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇలాంటి ఫిర్యాదు జగిత్యాలలో రెండోసారి రావడం గమనార్హం.
వివరాల్లోకెళ్తే.. జగిత్యాల పట్టణానికి చెందిన వీరం రాజేష్ ప్రజావాణి కార్యక్రమంలో జగిత్యాల పట్టణంలో గల గల కలెక్టర్ బీఎస్ లతకు ఫిర్యాదు చేశాడు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి మండలాలలో కింగ్ ఫిషర్ బ్రాండ్ లభిస్తుంది కానీ జగిత్యాలలో మాత్రమే ఎందుకు లభించడం లేదు. జగిత్యాలలో నాసిరకం మద్యపానం అమ్ముతున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై చర్చలు మొదలయ్యాయి. అయితే 2018 లో కూడా జగిత్యాలకు చెందిన అయిల సూర్యనారాయణ వైన్ షాప్ లో కింగ్ ఫిషర్ బ్రాండ్ దొరకడం లేదని కలెక్టర్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఇచ్చిన మనుషులు వేరైనా సమస్య ఒకటే కావడంతో జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించనున్నారా..? దీనికి ఎలాంటి పరిష్కారం చేయబోతున్నారు?