జగిత్యాల జిల్లాలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||జగిత్యాల జిల్లాలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి||

ఈవార్తలు, జగిత్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండల పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు జరిగాయి. మల్యాల బ్లాక్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మల్యాల మండలం పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు ముల్క మల్లయ్య, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు, మల్యాల సర్పంచ్ శ్రీ మిట్టపల్లి సుదర్శన్ పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన నిస్వార్థ సేవను కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో తాను ముందుండి తెలంగాణ ప్రజలను నడిపించారని, ఆయన కలలుగన్న తెలంగాణను భావితరాలు గుర్తుంచుకొని ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం కోశాధికారి బొమ్మకంటి గంగాధర్, సహాయ కార్యదర్శి బూదారపు గంగమల్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు పెంట సుధాకర్, వార్డు సభ్యుడు మిట్టపల్లి దశరథం, పద్మశాలి సంఘం మండల నాయకులు కొండబత్తిని గంగాధర్, బేతి సత్తన్న, పెంట రమేశ్, కటకం శ్రీనివాస్, బాలె హన్మండ్లు, ఎలిగేటి మునిందర్, తాటిపాముల శ్రీహరి, పల్నాటి మల్లేశం, మండల పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ సభ్యులు, మండలంలోని వివిధ గ్రామాల పద్మశాలి సంఘం అధ్యక్షులు మరియు నాయకులు పాల్గొన్నారు.





సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్