జగన్ వర్సెస్ షర్మిల.. అంశమేదైనా జగన్ పై విరుచుకుపడుతున్న సోదరి

ఏపీ రాజకీయాల్లో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా అధికార పార్టీపై మిగిలిన ప్రతిపక్షాలు విరుచుకుపడుతూ ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మధ్య పోరు నడుస్తోంది. వీరిద్దరూ జ్వరంగాత వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలలే కావడం గమనార్హం. ఒకరు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాగా, మరొకరు ఆయన సోదరి వైయస్ షర్మిల. ప్రస్తుతం వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతూ ఉండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ అంశం పైన మాట్లాడిన.. దానిపై కూటమి నాయకులు కౌంటర్ ఇవ్వడానికి సమయం పడుతుంది ఏమోగానీ.. షర్మిల మాత్రం వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు.

 ys jaganmohan reddy, ys sharmila

వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ షర్మిల

ఏపీ రాజకీయాల్లో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా అధికార పార్టీపై మిగిలిన ప్రతిపక్షాలు విరుచుకుపడుతూ ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మధ్య పోరు నడుస్తోంది. వీరిద్దరూ జ్వరంగాత వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలలే కావడం గమనార్హం. ఒకరు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కాగా, మరొకరు ఆయన సోదరి వైయస్ షర్మిల. ప్రస్తుతం వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతూ ఉండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ అంశం పైన మాట్లాడిన.. దానిపై కూటమి నాయకులు కౌంటర్ ఇవ్వడానికి సమయం పడుతుంది ఏమోగానీ.. షర్మిల మాత్రం వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్దిరోజుల క్రిందట అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తల్లికి, చెల్లికి, కుటుంబ సభ్యులకు న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎలా అన్యాయం చేస్తాడంటూ ప్రశ్నించారు. దుర్మార్గమైన వ్యక్తిగా అభివర్ణించారు. సొంత చెల్లి పైనే సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాన్ని చేయించారంటూ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఆయన వ్యాఖ్యలను ఖండించారు. తన చెల్లి వైయస్ షర్మిలపై ఎమ్మెల్యే బాలకృష్ణ కు చెందిన కార్యాలయం నుంచే దుష్ప్రచారం జరిగిందంటూ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గతంలో తన చెల్లి చెప్పారంటూ దానికి సంబంధించిన వీడియోను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుర్తించారు. చంద్రబాబు నాయుడు తన తల్లిదండ్రులు ఎవరో ఈ ప్రపంచానికి చూపించలేదని, తల్లిదండ్రులు చనిపోతే పెద్ద కుమారుడిగా దహన సంస్కారాలు కూడా నిర్వహించలేదని పేర్కొన్నారు.

అటువంటి వ్యక్తి తమ కుటుంబం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై సాధారణంగా అయితే కూటమి నాయకులు, టిడిపికి చెందిన మంత్రులు స్పందించాలి. కానీ ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. సైతాన్ సైన్యంతో తనపై దుష్ప్రచారం చేయించిన జగన్ మోహన్ రెడ్డి గా తనపై ప్రేమ ఉన్నది అంటూ వ్యాఖ్యానించారు షర్మిల. తనకు, ప్రభాస్కు సంబంధం ఉన్నట్టుగా బాలకృష్ణకు చెందిన భవనం నుంచి ప్రచారం జరిగినట్టు జగన్ చెప్పారని, నిజంగా చెల్లెలిపై ప్రేమ ఉంటే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారని నిలదీశారు. బాలకృష్ణపై ఎందుకు కేసు పెట్టి విచారణ జరిపించలేదని, ఐదేళ్లు గాడిదలు కాసారా అంటూ నిలదీశారు. ఈ ప్రచారంపై కేసు పెట్టిన రోజే ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకు చూడలేదంటూ తన బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈరోజు తన బిడ్డలపై ప్రమాణం చేసే అదే చెబుతున్నానని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇదంతా తెలిసి కూడా తనకు క్యారెక్టర్ లేనట్టుగా, ప్రభాస్ తో సంబంధం ఉన్నట్టుగా గత ఐదేళ్లు తన సైతాన్ సైన్యంతో ప్రచారం చేయించలేదా.? సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు పెట్టినప్పుడు తాను మాట్లాడిన వీడియో పనికొస్తుందంటే మీరు వాడేసుకుంటారని, చెల్లెల్ని వాడేసుకుంటారని విమర్శించారు. తల్లి మీద కేసు పెడతారని, నాన్న పేరును సిబిఐ షార్జ్ సీట్ లో చేర్పిస్తారని, మీరు ఏమైనా చేయగలరని, మీకు మీరే సాటి సార్ అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. షర్మిల మాట్లాడిన తర్వాత ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పోరాటం చేయవలసింది కూటమితో కాదని, తన సొంత చెల్లెలితో చేయాల్సి వస్తుందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్