అసెంబ్లీలో అడుగుపెట్టనున్న జగన్.. విమర్శలను తిప్పికొట్టేందుకే.!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈనెల 24 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గడిచిన ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ అసెంబ్లీ సమావేశాలను ఇప్పటి వరకు బహిష్కరిస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలంటే భయపడుతున్నాడు అంటూ పెద్ద ఎత్తున కూటమికి సంబంధించిన శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు జగన్ మోహన్ రెడ్డి రాకపోతే అనర్హత వేటు వేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Ys Jagan attending the House with MLAs

ఎమ్మెల్యేలతో సభకు హాజరైన జగన్ (ఫైల్ ఫోటో)

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. ఈనెల 24 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గడిచిన ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ అసెంబ్లీ సమావేశాలను ఇప్పటి వరకు బహిష్కరిస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలంటే భయపడుతున్నాడు అంటూ పెద్ద ఎత్తున కూటమికి సంబంధించిన శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు జగన్ మోహన్ రెడ్డి రాకపోతే అనర్హత వేటు వేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు వైసిపి వెళ్లాలని నిర్ణయించింది. జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజా నిర్ణయం ద్వారా ఈ తరహా విమర్శలకు చెప్పడంతోపాటు.. సరికొత్త వ్యూహరచనను జగన్మోహన్ రెడ్డి చేసినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడం వల్ల ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది.

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి ప్రభుత్వ విధానాలను విమర్శించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వైసిపి అసెంబ్లీకి వెళ్లిన మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మాట్లాడే అవకాశం ఇస్తే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడడం ద్వారా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇలా మాట్లాడేందుకు అవకాశం ఇస్తే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ఇరకాటంలోకి నెట్టడం ఒక ఎత్తు అయితే, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ద్వారా వైసిపి పై సానుభూతి పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదు అన్న నిర్ణయం ద్వారా వైసిపి డిఫెన్స్ లో ఉంటే.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా ఓటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి వైయస్ జగన్ నెట్టినట్టు అయింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించిన జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పట్ల ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎలా వ్యవహరిస్తారు అన్నదానిపైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది. 

ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ప్రధాన సమస్యలను ప్రస్తావించడంతోపాటు ప్రతిపక్ష హోదాను వైసీపీ నేతలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ప్రతిపక్ష హోదాలో ఉంటేనే సభలో ప్రజల తరఫున ప్రశ్నించే అవకాశం ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గళం విప్పడానికి ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇప్పటికే తమను ప్రతిపక్షంగా గుర్తించాలంటూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఇప్పటి వరకు హైకోర్టుకు తన అభిప్రాయాన్ని స్పీకర్ చెప్పలేదు. ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్షనేత హోదా ఉంటే కూటమినేతలను నిలదీస్తారని ప్రభుత్వం భావిస్తుండడం వల్లే దీనిపై నిర్ణయం తీసుకోవడం లేదని చెబుతున్నారు. శాసనసభలో సమగ్రంగా మాట్లాడకూడదని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తాత్సారం వహిస్తున్నట్లు కూటమి ప్రభుత్వంపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వం సభను ఏకపక్షంగా నడుపుతున్న నేపథ్యంలో.. వైసీపీ సభలో అడుగుపెడుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్