ఏపీలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవంతో ఢీలాపడిన వైసిపి కేడర్ ను సమయత్వం చేసే ప్రయత్నాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోవడంతో చాలామంది నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహంలో కూరుకు పోయారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం వైసిపి క్యాడర్ లక్ష్యంగా దాడులకు పాల్పడుతుండడంతో చాలామంది భయాందోళన చెందుతున్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి
ఏపీలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవంతో ఢీలాపడిన వైసిపి కేడర్ ను సమయత్వం చేసే ప్రయత్నాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోవడంతో చాలామంది నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహంలో కూరుకు పోయారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం వైసిపి క్యాడర్ లక్ష్యంగా దాడులకు పాల్పడుతుండడంతో చాలామంది భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేడర్ కు భరోసా కల్పించేలా జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాలకు ఇన్చార్జలను మార్చిన ఆయన.. పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతలకు అధికార ప్రతినిధులుగా అవకాశాలు కల్పించారు. ఈ క్రమంలోనే ఆయన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు. గతానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గడిచిన ఆరు నెలల్లోనే సుమారు 20 సార్లు మీడియాతో సమావేశమయ్యారు.
గతంలో మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఆసక్తి చూపించని జగన్మోహన్ రెడ్డి.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిసారి మీడియా ముందుకు వస్తుండడం కేడర్ను ఆనందానికి గురిచేస్తుంది. మరోవైపు పార్టీ క్యాడర్కు ఎక్కడ ఇబ్బంది జరిగిన వారికి అండగా ఉండేలా జిల్లాల వారిగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కూటమి నాయకులు దాడుల్లో హత్యకు గురికాబడిన వారి కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మరో రెండు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అందులో ఒకటి వచ్చే జనవరి నుంచి నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. పార్టీకి తాను ఉన్నానన్న భరోసాను కేడర్లో కల్పించనున్నారు. ఈ క్రమంలోనే మరో కీలకమైన ఆదేశాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్కు అందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న సోషల్ మీడియా గొంతు నొక్కే ప్రయత్నాన్ని కూటమి నాయకులు చేస్తున్నారు.
దీంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చిన ఆయన.. గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఫేస్ బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ వాడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, దాన్ని వీడియో తీసి అప్ లోడ్ చేయాలని కేడర్ కు సూచించారు. ఆయా వీడియోలను యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేయాలని ఆదేశించారు. ఏడాది పూర్తయ్యే సరికి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోంచి వాయిస్ రావాలని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ ఏమైందన్న దగ్గర నుంచి మొదలయ్యే ప్రశ్నల వర్షం.. ఏమైంది మా స్కూల్.? ఏమైంది మా హాస్పిటల్.? ఏమైంది మా ఆర్బీకే.?అంటూ ప్రశ్నల పరంపర కొనసాగాలంటూ కేడర్ కు జగన్మోహన్ రెడ్డి దిశ నిర్దేశం చేశారు. తాజా ఆదేశాల నేపథ్యంలో కోటిన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న బలమైన నిర్ణయాన్ని వైసిపి తీసుకున్నట్టు అయింది.