వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడి కీలక వ్యాఖ్యలు.. ఇరికిస్తున్నారంటూ కోర్టుకు వెల్లడి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సంజయ్‌రాయ్‌ను సీబీఐ అధికారులు కొద్దిరోజులుగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. కోర్టులో సంజయ్‌ రాయ్‌ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ వ్యాఖ్యానించడం ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తోంది.

medical students pritests

వైద్య విద్యార్థినికి మద్దతుగా ఆందోళన

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు  సంజయ్‌రాయ్‌ను సీబీఐ అధికారులు కొద్దిరోజులుగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. కోర్టులో సంజయ్‌ రాయ్‌ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ వ్యాఖ్యానించడం ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కేసులో పాలీగ్రాఫ్‌ పరీక్షకు నిందితుడు సమ్మతించడంతో కోర్టు అధికారులకు కొద్దిరోజులు కిందట అననుమతి ఇచ్చింది. అయితే, విచారణ సందర్భంగా సంజయ్‌రాయ్‌ న్యాయ స్థానంలో సంచలన ఆరోపణలు చేయడం ప్రస్తుతం కేసులో కీలక పరిణామంగా భావిస్తున్నారు. తను కావాలనే ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నట్టు చెబుతున్నారు. పాలీగ్రాఫ్‌ పరీక్షకు ఎందుకు సమ్మతిస్తున్నావ్‌ అంటూ మెజిస్ర్టేట్‌ నిందితుడిని ప్రశ్నించగా.. కన్నీళ్లు పెట్టుకుంటూ తాను అమాయకుడినని, ఏ తప్పు చేయలేదంటూ వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. తనను ఇందులో ఇరికించారని, ఈ పరీక్షతో అసలు బయటపడుతుందన్న ఉద్ధేశంతోనే పరీక్షకు అంగీకరించినట్టు తెలిసినట్టు చెబుతున్నారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగినటట్టు అయింది. 

సీబీఐ విచారణలో తానే నేరం చేసినట్టు అంగీకరించిన సంజయ్‌ రాయ్‌ కోర్టులో ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది. సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబోరేటరీకి చెందిన వైద్య బృందం నిందితుడి మానసిక తీరును విశ్లేషించింది. ఘటన సమయంలో ప్రతీ నిమిషం చోటుచేసుకున్న విషయాలను నిందితుడు గుంక తిప్పకుండా మొత్తం ఎపిసోడ్‌ను వివరించాడని, అతడిలో పశ్చాత్తాపమే లేనట్టు కనిపించిందని కేసు దర్యాప్తులో పాల్గొన్న సీబీఐ అధికారి చెపిన్నట్టు కథనాలు బయటకు వచ్చాయి. కానీ, కోర్టులో సంజయ్‌రాయ్‌ అందుకు భిన్నంగా తాను తప్పు చేయలేదని చెప్పడంతోపాటు అసలు నిందితులు బయటకు వస్తారని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిగా మారాయి. ముందు నుంచీ అందరూ అనుమానిస్తున్నట్టు ఈ వ్యవహారంలో వెనుక ఎవరో ఉన్నారన్న అనుమానాలకు తాజా వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇదిలా, ఉంటే నేరం జరిగిన ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీలోని అర్ధరాత్రి సమయంలో నిందితుడు వెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఈ రికార్డ్‌లో నిందితుడు మెడ చుట్టూ బ్లూట్లూత్‌ ఇయర్‌ఫోన్‌ కనిపించాయి. సెమినార్‌ హాల్‌లో వైద్యురాలి మృతదేహం గుర్తించిన ప్రాంతంలో ఈ బ్లూటూత్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సీసీటీవీ రికార్డులు ఆధారంగానే ఈ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్