దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు.. ఇళ్లు, ఆఫీసుల్లో కొనసాగుతున్న తనిఖీలు

టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజ్ ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాదులోని దిల్ రాజు ఇంట్లో, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజ్ ఇంటితోపాటు నగరంలోని పలుచోట్ల ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగర వ్యాప్తంగా 55 బృందాలు ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులతోపాటు కుటుంబ సభ్యుల ఇల్లు, కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన పలు సినిమాలో సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి.

Producer Dil Raju

నిర్మాత  దిల్ రాజు

టాలీవుడ్ టాప్ నిర్మాత  దిల్ రాజు ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాదులోని దిల్ రాజు ఇంట్లో, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజ్ ఇంటితోపాటు నగరంలోని పలుచోట్ల ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగర వ్యాప్తంగా 55 బృందాలు ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులతోపాటు కుటుంబ సభ్యుల ఇల్లు, కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన పలు సినిమాలో సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి. వీటిలో రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన గేమ్ చెంజర్ తోపాటు, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతి వస్తున్నాం సినిమాలు ఉన్నాయి. రెండు సినిమాలు మంచి విజయానికి సాధించి ముందుకు సాగుతున్నాయి. రెండు చిత్రాల నిర్మాణంలో శిరీష్ కూడా భాగస్వామిగా ఉన్నారు.

ఆయన ఇంటితోపాటు దిల్ రాజ్ కుమార్తె హన్సిత రెడ్డి నివాసాల్లో కూడా తాజాగా ఐటి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజుపై ఐటి అధికారులు దాడులు చేయడంతో ఒక్కసారిగా సినిమా వర్గాల్లో అలజడి నెలకొంది. డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా డీల్ రాజు ఎదిగారు. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారడం, సినిమా మంచి విజయం సాధించడంతో సినిమా పేరు ఇంటిపేరుగా మారిపోయింది. ఒకవైపు నిర్మాతగా రాణిస్తూనే మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు దిల్ రాజు. ఇటీవల దిల్ రాజును తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్ గా నియమించింది. ఈ నేపథ్యంలో దిల్ రాజుపై ఐటి అధికారులు దాడులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దాడులు సాధారణమైననే, అన్నింటికీ లెక్కలు ఉన్నాయని దిల్ రాజుకు సంబంధించిన కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ దాడులు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆయా కార్యాలయాలు, ఇళ్లలో పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఐటి అధికారులు స్పందించేంత వరకు పూర్తిస్థాయిలో తెలియదని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్