మహా కుంభమేళాకు వేళాయె.. రేపటి నుంచి అతిపెద్ద హిందూ పండగ

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఉత్సవం మహా కుంభమేళాకు వేళయింది. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహోత్తర సమ్మేళనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ మహా కుంభమేళాకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈనెల 13 నుంచి వచ్చేనెల 26 వరకు 45 రోజులపాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ వేదికగా మహా కుంభమేళా జరగనుంది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రాంతంలో మహా కుంభమేళా జరుగుతుంది.

Prayag Raj is the venue of the Kumbh Mela

కుంభమేళా జరిగే ప్రయాగ్ రాజ్ వేదిక

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఉత్సవం మహా కుంభమేళాకు వేళయింది. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహోత్తర సమ్మేళనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ మహా కుంభమేళాకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈనెల 13 నుంచి వచ్చేనెల 26 వరకు 45 రోజులపాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ వేదికగా మహా కుంభమేళా జరగనుంది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రాంతంలో మహా కుంభమేళా జరుగుతుంది. జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ బృహత్తర క్రతువు ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజు ముగియనుంది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన వేడుక కావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాటు చేసింది. ప్రయాగ్ రాజును యోగి సర్కారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. పట్టణంలో అడుగుపెట్టిన చోటు నుంచి ఆధ్యాత్మిక శోభ విలువిరుస్తోంది. దాదాపు ప్రతి కూడలిలో గజ్జెలు, డమరుకం వంటి చిహ్నాలను ఉంచింది. గోడలకు పెయింటింగులు వేసింది.

విద్యుత్తు, ఇతర స్తంభాలకు త్రినేత్రం తదితర సొబగులను అద్దింది. నెలన్నర పాటు పుణ్యస్నానాలు ఆచరించేందుకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు, యాత్రికులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. త్రివేణి సంగమానికి ఇరువైపులా దాదాపు నాలుగువేల హెక్టార్లలో సౌకర్యాలను కల్పిస్తోంది. కోట్లాదిమంది భక్తులు హాజరయ్యే మహాకుంభమేళా కోసం ప్రభుత్వం అంతే స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ఇప్పటికే సమగ్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 2,750 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. అత్యంత కీలక, సమస్యాత్మక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత కెమెరాలను బిగిస్తోంది. భక్తులకు సమాచారాన్ని అందించేందుకు 80 వీఎండి టీవీ స్క్రీన్ లను ఏర్పాటు చేస్తోంది. 1920 పేరిట హెల్ప్ లైన్ తో పాటు 50 మందితో కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన నిఘా కోసం డ్రోన్లు, ఏఐ సాయంతో కెమెరాలను వినియోగించనుంది. నీటిలోనూ మెగా ఉంచే డ్రోన్లు అందుబాటులో ఉంచుతోంది. సైబర్ మోసాలకు తావు లేకుండా 56 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను రంగంలోకి దించుతోంది. 

ఇవే ముఖ్యమైన రోజులు 

మహా కుంభమేళాలో కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈనెల 13న పుష్య పౌర్ణమి స్నానం (ప్రారంభ రోజు), ఈనెల 25 మకర సంక్రాంతి స్నానం, 29న మౌని అమావాస్య స్నానం, ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి స్నానం, ఫిబ్రవరి 12న నాగ పౌర్ణమి స్నానం, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి స్నానం (ముగిసే రోజు) అత్యంత కీలకమైన రోజులుగా నిపుణులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్