ఈ మధ్యకాలంలో ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లను కలిగి ఉంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. వివిధ అవసరాన్ని రిత్యా ఎంతోమంది పలు బ్యాంకులకు చెందిన అకౌంట్లను ఓపెన్ చేస్తుంటారు. అయితే వీటిలో ఒకటి మాత్రమే రెగ్యులర్గా వినియోగిస్తూ మిగిలిన వాటిని పెద్దగా లావాదేవీలను చేయరు. అయితే అటువంటి బ్యాంకు అకౌంట్లు వల్ల ఇబ్బందులే తప్పితే ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఒకటికంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్ లో కలిగి ఉన్నవారు రెగ్యులర్గా వినియోగించకుండా ఉంటే మాత్రం వాటిని క్లోజ్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. లేకపోతే కొన్ని రకాల నష్టాలను వినియోగదారులు భరించాల్సి ఉంటుంది. ఎక్కువ బ్యాంకు అకౌంట్లను కలిగి ఉండడం వల్ల ఎటువంటి నష్టాలను భరించాల్సి ఉంటుంది అన్న వివరాలను మీరు తెలుసుకోండి.
ప్రతీకాత్మక చిత్రం
ఈ మధ్యకాలంలో ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. వివిధ అవసరాన్ని రిత్యా ఎంతోమంది పలు బ్యాంకులకు చెందిన అకౌంట్లను ఓపెన్ చేస్తుంటారు. అయితే వీటిలో ఒకటి మాత్రమే రెగ్యులర్గా వినియోగిస్తూ మిగిలిన వాటిని పెద్దగా లావాదేవీలను చేయరు. అయితే అటువంటి బ్యాంకు అకౌంట్లు వల్ల ఇబ్బందులే తప్పితే ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఒకటికంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్ లో కలిగి ఉన్నవారు రెగ్యులర్గా వినియోగించకుండా ఉంటే మాత్రం వాటిని క్లోజ్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. లేకపోతే కొన్ని రకాల నష్టాలను వినియోగదారులు భరించాల్సి ఉంటుంది. ఎక్కువ బ్యాంకు అకౌంట్లను కలిగి ఉండడం వల్ల ఎటువంటి నష్టాలను భరించాల్సి ఉంటుంది అన్న వివరాలను మీరు తెలుసుకోండి. సాధారణంగా ఒక బ్యాంకులో అకౌంట్ ఉందంటే అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మినిమం బ్యాలెన్స్ లేకుండా ఉంటే వాటిపై బ్యాంకు చార్జీలు వసూలు చేస్తుంది. కొన్నిసార్లు మైనస్ బ్యాలెన్స్ లోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత లావాదేవులు చేయాలంటే ముందు మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి వినియోగదారులకు ఏర్పడుతుంది. ఇటువంటి ఇబ్బందులు ఎక్కువగా రెండుకుమించి బ్యాంకు అకౌంట్లను కలిగి ఉన్న వారికి ఎదురవుతుంటాయి. అలాగే బ్యాంకు అకౌంట్ ఉపయోగించకుండా అలాగే వదిలేస్తే అందులో ఉన్న మినిమం బాలన్స్ వంటి వృధా అవుతాయి. ఒక నాలుగు ఎకౌంట్లో ఉన్నాయనుకుంటే అందులో కేవలం ఒకదాని మాత్రమే వాడుతూ మిగిలిన వాటిని ఉపయోగించకుండా వదిలేస్తే అందులో ఉన్న డబ్బు వృధా అయినట్టే అని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ ఎకౌంటు మెయింటెనెన్స్ చేయకుండా ఉండటమే దేనికి పరిష్కారంగా చెబుతున్నారు. అదే సమయంలో టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మీరు ఉపయోగించకుండా బ్యాంకు అకౌంట్లను ఉంచడం వల్ల సైబర్ నేర్గాలు వాటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇటువంటి చర్యలు బ్యాంకు వినియోగదారులను చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకు ఎకౌంటు వృధాగా ఉన్న అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదా క్లోజ్ చేసుకోవడం మంచిది. ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉండి వాటిని నిరంతరం వినియోగించకపోవడం వల్ల సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపిస్తుంది. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా లేకుంటే మైనస్ బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది. అంటే దీని అర్థం మీరు బ్యాంకుకు అప్పు ఉన్నారని. ఇది క్రెడిట్ కోరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. సివిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే యాక్టివ్ గా ఉన్న అకౌంట్స్ కాకుండా మిగిలినవన్నీ వెంటనే క్లోజ్ చేసుకోవడం మంచిది. ఎక్కువ బ్యాంకు ఎకౌంట్లోను కలిగి ఉండడాన్ని చాలామంది గొప్పగా ఫీల్ అవుతుంటారు. వారికి ఈ అంశాల పట్ల అవగాహన లేకపోవడం వల్లే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు నిర్వహిస్తుంటారని చెబుతున్నారు. కాబట్టి ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బ్యాంకు అకౌంట్లను నిర్వహించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.