తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్నాసులు ఎవరో, అసమర్థులు ఎవరో ఆ ప్రభుత్వంలోని సహచరులే చెబుతున్నారని భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ముక్కు నేలకు రాయాల్సింది ఎవరో, పదవులకు రాజీనామా చేయాల్సింది ఎవరో, సన్నాసులు ఎవరో, సమర్థులు ఎవరో, అబద్దాలు చెబుతున్నది ఎవరో, నిజాలు మాట్లాడుతున్నది ఎవరో అందరికీ తెలుసని కేటీఆర్ స్పష్టం చేశారు. తామైతే కాదని, ఈ విషయాలను మీ మంత్రివర్గ సహచరుడే చెబుతున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్నాసులు ఎవరో, అసమర్థులు ఎవరో ఆ ప్రభుత్వంలోని సహచరులే చెబుతున్నారని భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ముక్కు నేలకు రాయాల్సింది ఎవరో, పదవులకు రాజీనామా చేయాల్సింది ఎవరో, సన్నాసులు ఎవరో, సమర్థులు ఎవరో, అబద్దాలు చెబుతున్నది ఎవరో, నిజాలు మాట్లాడుతున్నది ఎవరో అందరికీ తెలుసని కేటీఆర్ స్పష్టం చేశారు. తామైతే కాదని, ఈ విషయాలను మీ మంత్రివర్గ సహచరుడే చెబుతున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీపై నువ్వు చెప్పింది శుద్ధ అబద్దమని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ కొండా రెడ్డిపల్లిలో లేదా కొడంగల్ లో ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణలు చెప్తావా!? అని కేటీఆర్ నిలదీశారు. రైతు డిక్లరేషన్ ఒక బూటకమని, సంపూర్ణ రైతు రుణమాఫీ పచ్చి అబద్దమని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలన తెలంగాణ రైతాంగానికి ముమ్మాటికీ శాపమని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అన్ని వర్గాల ప్రజల్లో అసహనం పెల్లుబుకుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలను ఇచ్చిందని.. ఆ హామీలను అమలు చేయడంలో విఫలమైందన్న ఉద్దేశంతో కేటీఆర్ ఈ తరహా విమర్శలను చేశారు. ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్న విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తూర్పారబడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ మరోసారి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నుంచి వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ విమర్శలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరి కేటీఆర్ చేసిన ఈ విమర్శలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.