వ్యాధులతో ఐటీ ఉద్యోగుల పరేషాన్.. చుట్టుముడుతున్న అనేక సమస్యలు.!

రాత్రి పగలు తేడా లేకుండా గంటలకొద్దీ పని చేయాల్సి రావడం.. డెడ్లైన్ల వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన తిండి ఇటువంటి ఐటీ ఉద్యోగులను రోగాల ఊపులోకి నడుస్తున్నాయి. ఇదే విషయాన్ని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సాయంతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు ఐటీ ఉద్యోగులను అనేక అనారోగ్య సమస్యలు బారిన పడేలా చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఐటీ ఉద్యోగులు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది భారీ వేతనాలతో కూడిన ఉద్యోగం. వారాంతాల్లో విలాసాలు, జాలీ లైఫ్ అని అంతా భావిస్తారు. అయితే నాణేనికి ఒక వైపే కాదు.. రెండో వైపు చూస్తే వారి ఇబ్బందులు తెలుస్తాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు నేటి ఉద్యోగులను వేధిస్తుంటాయి. రాత్రి పగలు తేడా లేకుండా గంటలకొద్దీ పని చేయాల్సి రావడం.. డెడ్లైన్ల వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన తిండి ఇటువంటి ఐటీ ఉద్యోగులను రోగాల ఊపులోకి నడుస్తున్నాయి. ఇదే విషయాన్ని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సాయంతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు ఐటీ ఉద్యోగులను అనేక అనారోగ్య సమస్యలు బారిన పడేలా చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గతంతో పోలిస్తే ఐటి ఉద్యోగుల్లో అనారోగ్య సమస్యలు బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ఈ అధ్యాయం వెల్లడించింది. యుక్త వయస్సులోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి అనారోగ్య సమస్యలు 

తాజా అధ్యయనం ప్రకారం ఐటీ ఉద్యోగుల్లో కనిపిస్తున్న అనారోగ్య సమస్యల్లో ఎక్కువగా ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తేలింది. సుమారు 84 శాతం మంది ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారు. అధిక బ్లడ్ ప్రెజర్, డయాబెటిస్ తో సంబంధం ఉన్న మెటబాలిక్ సిండ్రోమ్ రోగులు 34 శాతం మంది ఉన్నట్లు ఈ అధ్యాయం వెల్లడించింది. వీటితోపాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా అధికంగా ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాదులోని అనేక ప్రాంతాల్లో ఈ సర్వేను నిర్వహించారు. అన్ని రంగాల్లో కలిపి ఒత్తిడి ఎదుర్కొంటున్న ఉద్యోగినులు 74.7% మంది కాగా, అన్ని రంగాల్లో కలిపి ఒత్తిడి ఎదుర్కొంటున్న ఉద్యోగులు 73.7 శాతం మంది ఉన్నారు. పని ఒత్తిడి కారణంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో రాజీ పడినవారు 68.25 శాతం మంది ఉన్నట్టు చేరింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్