శ్రీహరికోట నుంచి ఇస్రో వందో ప్రయోగం విజయవంతం.. సంబరాల్లో సైంటిస్టులు

భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం విజయవంతమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. సూళ్లూరుపేటలోని శ్రీహరికోట నుంచి బుధవారం తెల్లవారుజామున జిఎస్ఎల్వి ఎఫ్ -15 రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్ళింది. సుమారు 200250 కిలోల బరువున్న ఎన్విఎస్-02 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇస్రో దీనిని నింగిలోకి ప్రవేశపెట్టింది. ప్రధానంగా కొత్త రకం నేవిగేషన్ ఉపగ్రహాల్లో ఎన్విఎస్ -02 రెండోది.

The rocket that jumps into the niche

నింగిలోకి దూసుకెళుతున్న రాకెట్                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            

భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం విజయవంతమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. సూళ్లూరుపేటలోని శ్రీహరికోట నుంచి బుధవారం తెల్లవారుజామున జిఎస్ఎల్వి ఎఫ్ -15 రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్ళింది. సుమారు 200250 కిలోల బరువున్న ఎన్విఎస్-02 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇస్రో దీనిని నింగిలోకి ప్రవేశపెట్టింది. ప్రధానంగా కొత్త రకం నేవిగేషన్ ఉపగ్రహాల్లో ఎన్విఎస్ -02 రెండోది. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు దీనిపై దృష్టి సారించాయి. ఇస్రో కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల కృషికి ఫలితం దక్కినట్టు అయింది. దీని బరువు 2,250 కిలోలు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవలు కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారత సేవలను అందించనుంది. పదేళ్లపాటు ఈ నావిగేషన్ శాటిలైట్ తన సేవలను అందిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. 

ఇస్రో వందో ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆయన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం ఇదే కావడం విశేషం. తొలి ప్రయోగం విజయవంతం కావడం ఇస్రో శాస్త్రవేత్తలకు ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అయింది. భవిష్యత్తులో ఈ తరహా ప్రయోగాలను మరింత విజయవంతంగా చేసేందుకు ఈ విజయం దాహదం చేస్తుందని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు. నావిగేషన్ శాటిలైట్ ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టామని, ఇస్రో వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇస్రో చైర్మన్ నారాయణన్ నేతృత్వంలోని జరిగిన తొలి ప్రయోగం ఇదే కావడం గమనార్హం.  ఇస్రో శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని స్థాపించిన తర్వాత ఇప్పటివరకు 99 ప్రయోగాలను నిర్వహించింది. తాజాగా నిర్వహించిన ప్రయోగం వందోది. వీటిలో కేవలం పది ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి. వంద ప్రయోగం కూడా విజయవంతం కావడంతో సైంటిస్టులు హర్షాన్ని వ్యక్తం చేశారు. మెరుగైన జిపిఎస్ తరహా నేవిగేషన్ సిస్టం అందుబాటులోకి ఈ ప్రయోగం వల్ల రానుంది. భారత భూభాగంతో పాటు భారత భూభాగంలోని తీరం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు ఈ నావిగేషన్ సిస్టం పనిచేస్తుందని సైంటిస్టులు పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్