భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్ష కార్యక్రమంలో మరో ప్రతిష్టాత్మకమైన అడుగు వేయబోతోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కీలకమైన ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతోంది. పిఎస్ఎల్వి సి-60 రాకెట్ను నింగిలోకి పంపించేందుకు ఇస్రో ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇస్రో స్పేస్ డాకింగ్ ప్రయోగం మిషన్ కోసం కౌంటన్ ఆదివారం రాత్రి ప్రారంభమైంది. అంతరిక్షంలో డాకింగ్ టెక్నాలజీలో ప్రావీణ్యం పొందిన చైనా రష్యా అమెరికా వంటి దేశాలు జాబితాలో భారత్ ను ఈ మిషన్ చేర్చనుంది.
ఇస్రో కీలక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్ష కార్యక్రమంలో మరో ప్రతిష్టాత్మకమైన అడుగు వేయబోతోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కీలకమైన ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధమవుతోంది. పిఎస్ఎల్వి సి-60 రాకెట్ను నింగిలోకి పంపించేందుకు ఇస్రో ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇస్రో స్పేస్ డాకింగ్ ప్రయోగం మిషన్ కోసం కౌంటన్ ఆదివారం రాత్రి ప్రారంభమైంది. అంతరిక్షంలో డాకింగ్ టెక్నాలజీలో ప్రావీణ్యం పొందిన చైనా రష్యా అమెరికా వంటి దేశాలు జాబితాలో భారత్ ను ఈ మిషన్ చేర్చనుంది. ఈ మిషన్ లో భాగంగా డిసెంబర్ 30వ తేదీ రాత్రి 9:58 గంటలకు శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వీ - సీ60 రాకెట్ ను ఉపయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది.
ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ మిషన్ స్పా డెక్స్ ను దాని ప్రాథమిక పేలోడ్ గా తీసుకు వెళుతుంది. ఇందులో రెండు అంతరిక్ష నాయకులు ఉంటాయి. వీటితోపాటు మరో 24 సెకండ్లు పేలోడ్లు కూడా పంపబడతాయి. ఈ ప్రయోగంతో భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఫ్యూచర్ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ సహాయంతో భారత దేశ అంతరిక్ష ఆశయాలను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని పైకి మనుషులతో కూడిన మిషన్లు, నమూనాలను తిరిగి తీసుకురావడానికి భారతదేశ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి, నిర్వహించడానికి ఈ సాంకేతికత అవసరం అవుతుంది. భారత అంతరిక్ష కేంద్రం ఒకటికంటే ఎక్కువ రాకెట్లను ఉపయోగించడం ద్వారా సాధారణ లక్ష్యాలను సాధించే మిషన్లలో కూడా ఈ సాంకేతికత ఉపయోగించబడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే భవిష్యత్తులో అద్భుతమైన ప్రగతిని సాధించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.