వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ తప్పదా.. మద్యం కేసులో ఆరోపణలకు కారణం అదేనా.!

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీని పూర్తిస్థాయిలో లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేచులను వివిధ కేసుల్లో జైలుకు పంపించారు. అయితే కుంభస్థలాన్ని కొట్టాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్య నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం కంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా వైసీపీని పూర్తిగా లేకుండా చేయవచ్చన్న భావనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏపీలో మద్యం కుంభకోణంపై వరుస క్రమంలో విమర్శలు చేస్తున్నారంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసిపి మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కొద్దిరోజుల కిందట సిఐడి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఢిల్లీకి మించిన మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీని పూర్తిస్థాయిలో లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేచులను వివిధ కేసుల్లో జైలుకు పంపించారు. అయితే కుంభస్థలాన్ని కొట్టాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్య నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం కంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా వైసీపీని పూర్తిగా లేకుండా చేయవచ్చన్న భావనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏపీలో మద్యం కుంభకోణంపై వరుస క్రమంలో విమర్శలు చేస్తున్నారంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసిపి మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కొద్దిరోజుల కిందట సిఐడి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఢిల్లీకి మించిన మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇందులో వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంచ రెడ్డి పాత్రను ఆయన వివరించారు. విజయసాయిరెడ్డి ఈ ఆరోపణలు చేసిన కొద్ది రోజులు తర్వాత పార్లమెంటు వేదికగా కూటమి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపణలు చేశారు.

సుమారు 2000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు ఇతర దేశాలకు తరలిపోయిందంటూ ఆరోపించారు. దీనిపై సమగ్రమైన విచారణ జరిపించాలంటూ ఆయన పార్లమెంటులో కోరారు. అనంతరం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసి ఆరోపణలకు సంబంధించిన వివరాలను అందించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఈ పరిణామాలను నిచితంగా గమనిస్తున్న వారందరికీ ఇప్పుడు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అన్న విషయం అర్థమవుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిపై వివిధ ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వం ఒక్కటి కూడా రుజువు చేయలేదు. అయితే మద్యం కేసులో కీలక ఆధారాలను కూటమి ప్రభుత్వం సేకరించినట్లు తెలుస్తోంది. బేవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి కూడా అప్రూవల్ గా మారినట్లు చెబుతున్నారు. ఆయన వద్ద నుంచి సేకరించిన కీలక ఆధారాలను ఆధారంగా చేసుకుని శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ వేదికగా ఆరోపణలు చేసినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన వివరాలను సేకరించడంతో సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. 

విచారణకు కేంద్రం ఆదేశిస్తుందా.?

ఢిల్లీకి మించిన మద్యం కుంభకోణం ఏపీలో జరిగిందంటూ గడిచిన కొన్ని రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణానికి, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధమే లేదని పలువురు పేర్కొంటున్నారు. ఏపీలో మద్యం అమ్మకాలు పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగాయి. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి చేరింది. ఢిల్లీలో ప్రైవేట్ వ్యక్తులు ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు సాగాయి. ఇక్కడ వచ్చిన ఆదాయం ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వెళ్ళింది. కాబట్టి ఢిల్లీమద్యం కుంభకోణంతో ఏపీ మద్యం అమ్మకాలను పోల్చలేము అని పలువురు పేర్కొంటున్నారు. అదే సమయంలో ఏపీ మద్యం కుంభకోణం అంశానికి సంబంధించిన వస్తున్న ఆరోపణలపై ఇప్పటివరకు బిజెపి పెద్దలు ఎవరు స్పందించలేదు. ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో బిజెపి ముఖ్యులు సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ, వైఎస్ జగన్ మధ్య ఆత్మీయ సంబంధం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏపీలో బలంగా ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఎటువంటి చర్యలను తీసుకోలేకపోతున్నారని చెబుతున్నారు. అలాగే గతంలో తిరుపతి లడ్డు వ్యవహారంలో ఆరోపణలు చేసిన దానిపైన ఇప్పటివరకు స్పష్టత రాలేదని చెబుతున్నారు. అలాగే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలోనూ టిడిపి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కూడా ఇప్పటివరకు నిరూపించలేని పరిస్థితిలో టిడిపి ఉంది. మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు కూడా అలానే ఉంటాయని దీనిపై కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. మరి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తుందా.? టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటుందా.? లేదా.? అన్నది చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్