యాక్టివేట్ చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలోనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గాల వారికి ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూనే సీనియర్ నేతలతో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరినీ గుర్తించుకుంటామని, అధికారంలోకి రాగానే వారికి మేలు చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి పేర్కొంటున్నారు. ఇందుకోసం గుడ్ బుక్ అమలు చేస్తామని స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. తాము అధికారంలోకి వస్తే గుడ్ బుక్ అమలు చేస్తామంటూ తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో గతంలో వైసిపికి అనుకూలంగా వ్యవహరించి టిడిపి నాయకులు కార్యకర్తలపై ఇష్టానుసారంగా వ్యవహరించిన నాయకులు అధికారులను లక్ష్యంగా చేసుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీ శ్రేణులంతా రెడ్ బుక్ కేంద్రంగా విమర్శలను గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక స్లొగన్ ను తెరపైకి తీసుకువచ్చారు. అదే గుడ్ బుక్. ఈ అస్త్రాన్ని టిడిపిపై ప్రయోగించేందుకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నాయకులతో సమావేశాలను నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. అనేకచోట్ల సీనియర్ నేతలకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కీలక నాయకులు సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో వారందరినీ యాక్టివేట్ చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలోనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గాల వారికి ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూనే సీనియర్ నేతలతో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరినీ గుర్తించుకుంటామని, అధికారంలోకి రాగానే వారికి మేలు చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి పేర్కొంటున్నారు. ఇందుకోసం గుడ్ బుక్ అమలు చేస్తామని స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో అధికారులు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే వారికి కూడా ఈ గుడ్ బుక్ వర్తిస్తుందంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చిన ఈ గుడ్ బుక్ స్లోగన్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.
జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన గుడ్ బుక్ నినాదం వల్ల భవిష్యత్తులో నాయకులు కార్యకర్తలు, యాక్టివేట్ అయ్యే మరింత కష్టపడి పనిచేసేందుకు అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ విధానాలపై క్షేత్రస్థాయిలో బలంగా పోరాడే అవకాశం వైసిపికి లభిస్తుంది. గతంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కేడర్ను నిర్లక్ష్యం చేశారు. క్షేత్రస్థాయిలో పనులు చేసుకునే అవకాశం కూడా నాయకులకు, కార్యకర్తలకు లభించలేదు. దీంతో చాలామంది నిరాహాని స్పృహలకు లోనై గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచలేదు. దాని ఫలితమే అనేక నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్థులు దారుణంగా పరాభవం చెందారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు, నాయకులకు భరోసాను కల్పించేలా గుడ్ బుక్ తీసుకువచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ పనిచేసే నాయకులకు ప్రాధాన్యతనిచ్చేలా గుడ్ బుక్ పనిచేయడంతోపాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే అధికారులకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదోన్నతులను కల్పిస్తామన్న భరోసాను జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారు. దీనివల్ల అధికారులకు కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుందని, ఈ గుడ్ బుక్ భవిష్యత్తులో వైసీపీ శ్రేణులను ఇబ్బందులు గురి చేసే విషయంలో అధికారులు పునరాలోచించేలా చేస్తుందని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన గుడ్ బుక్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిమైన చర్చకు దారి తీసింది.