జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి వర్గంలో చేరిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తొలుత అనుకోని దాని ప్రకారం అయితే ఉగాదికే నాగబాబు మంత్రివర్గంలో చేరాల్సి ఉంది. అయితే కొద్ది రోజుల కిందట జనసేన ఆవిర్భావ సభలో నాగేంద్రబాబు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. పవన్ కళ్యాణ్ గెలుపుకు ఎవరో కృషి చేశారు అనుకుంటే అది వారి ఖర్మ అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ నాగబాబు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి వర్గంలో చేరిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తొలుత అనుకోని దాని ప్రకారం అయితే ఉగాదికే నాగబాబు మంత్రివర్గంలో చేరాల్సి ఉంది. అయితే కొద్ది రోజుల కిందట జనసేన ఆవిర్భావ సభలో నాగేంద్రబాబు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. పవన్ కళ్యాణ్ గెలుపుకు ఎవరో కృషి చేశారు అనుకుంటే అది వారి ఖర్మ అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తల మధ్య పెద్ద వివాదమే నడిచింది. సామాజిక మాధ్యమాలు వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఈ క్రమంలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు పునరాలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే టిడిపికి చెందిన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు నాయుడు కొంత జాప్యం చేయడం ద్వారా సానుకూల ఫలితాలను రాబట్టువచ్చని భావిస్తున్నారు.
కొద్దిరోజులపాటు వేచి ఉండడం ద్వారా టిడిపి శ్రేణుల ఆగ్రహాన్ని తగ్గించవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ మేరకు నాగబాబుకు, పవన్ కళ్యాణ్ కు సమాచారాన్ని అందించారు. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో ఎప్పటికప్పుడు తాత్కారం జరుగుతూ వస్తోంది. చంద్రబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని గ తేడాది డిసెంబర్లోనే నిర్ణయించారు. అయితే అనూహ్యంగా రాజ్యసభకు నాగబాబు వెళ్తారన్న ప్రచారం జరిగింది. కానీ నాగబాబుకు మంత్రి పదవి చేపట్టాలన్న కోరిక ఉండడంతో పవన్ కళ్యాణ్ ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడును కోరినట్లు చెబుతున్నారు. నాగబాబు కోరిక మేరకు సంక్రాంతి నాటికి మంత్రి పదవిలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ సంక్రాంతి పండుగకు ఇటువంటి ప్రకటన ఏది జరగలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడం, ఆస్థానాల్లో ఒకదానికి నాగబాబును ఎంపిక చేయడం చకచకా జరిగిపోయాయి. నాగబాబు మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖరారు అయింది. ప్రస్తుతం జనసేన కు చెందిన ఒక మంత్రి నిర్వహిస్తున్న శాఖలను నాగబాబుకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఉగాది సమయంలో ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. అయితే అనుక్షంగా పిఠాపురం సభలో నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా దుమారం రేగింది.
ఈ పరిస్థితుల్లో నాగబాబుకు పదవి ఇవ్వడం వల్ల కూటమిలోని కార్యకర్తలు రగిలిపోయే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు నాయుడు కొంత సమయం తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. కానుకూల వాతావరణంలో పదవులను కేటాయిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని చంద్రబాబునాయుడు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరి కొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి నాగబాబుకు ఏర్పడింది. ఇప్పటికే నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన శాసనమండలికి హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని చెబుతున్నారు. అయితే నాగబాబు మాత్రం మంత్రివర్గం లో తీసుకున్న తర్వాతే శాసనమండలికి హాజరుకావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగు పెట్టేందుకు ఆయన ఆసక్తి చూపించడం లేదు. మంత్రిగాని శాసనమండలిలోకి వెళ్లాలన్న కోరికలను తన సోదరుడు పవన్ కళ్యాణ్ వద్ద ఆయన వెలుబుచ్చినట్లు తెలుస్తోంది. అయితే అప్పటివరకు శాసనమండలి సమావేశాలకి వెళ్లకుండా ఉండడం వల్ల సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై పవన్ కళ్యాణ్ తో సమావేశమైన తర్వాత నాగేంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీలైనంత వేగంగా నాగేంద్రబాబుకు మంత్రి పదవి ఇచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కోరేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు.