రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య గడిచిన కొన్నాళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. సుమారు నాలుగేళ్లుగా ఈ యుద్ధం జరుగుతోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని నగరాలు ఈ యుద్ధంలో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు, అపారమైన సైనిక సంపత్తి కలిగిన రష్యాతో చిన్న దేశమైన ఉక్రెయిన్ భీకర స్థాయిలో పోరాటాన్ని కొనసాగిస్తోంది. తాజాగా కుర్క్స్ ప్రాంతానికి ఉక్రెయిన్ దళాలు చేర్చుకుని ఆక్రమించాయి.
సైన్యం రహస్య దుస్తులు
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య గడిచిన కొన్నాళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. సుమారు నాలుగేళ్లుగా ఈ యుద్ధం జరుగుతోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని నగరాలు ఈ యుద్ధంలో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు, అపారమైన సైనిక సంపత్తి కలిగిన రష్యాతో చిన్న దేశమైన ఉక్రెయిన్ భీకర స్థాయిలో పోరాటాన్ని కొనసాగిస్తోంది. తాజాగా కుర్క్స్ ప్రాంతానికి ఉక్రెయిన్ దళాలు చేర్చుకుని ఆక్రమించాయి. దీని వెనుక రహస్య దుస్తులు ఉన్నాయన్న ఆరోపణలను రష్యా చేస్తోంది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ దళాలకు ఈ ప్రత్యేక యూనిఫామ్ ను అందించాయని, వీటిని ధరించడం వల్ల ఉక్రెయిన్ సైనికులు పగలు, రాత్రి కూడా శత్రువులకు కనిపించలేదంటూ రూపొందించిన నివేదిక రష్యా మిలటరీ పోర్టల్ లో దర్శనమిస్తోంది. ఈ ఘటన వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందని రష్యా ఆరోపిస్తోంది. అయితే ఈ వాదనలను అంతర్జాతీయ మీడియా తోసిపుచ్చింది. కుర్క్స్ ప్రాంతంలోకి గణనీయంగా వచ్చిన మిలటరీ సామాగ్రి, కదలికలు కనిపించకుండా చేయడం అసాధ్యమని రష్యా విమర్శకులు పేర్కొంటున్నారు. అమెరికా ప్రైవేట్ మిలటరీ కంపెనీల భాగస్వామ్యం వల్లే ఉక్రెయిన్ ఆకస్మిక విజయం సాధించిందని అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. దీంతోపాటు అమెరికా జర్నలిస్టులు అక్రమంగా రష్యా భూభాగంలోకి వస్తున్నారని ఆరోపించింది.
అదృశ్య వస్త్రం అంటే ఏమిటి..?
ఉక్రెయిన్ దళాలు రష్యా భూభాగాల్లోకి చొచ్చుకు రావడం వెనుక అదృశ్య వస్త్రాలు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. అసలు అదృశ్య వస్త్రం అంటే ఏమిటి..? అన్న ప్రశ్నలు ప్రస్తుతం సర్వత్ర ఉత్పన్నమవుతున్నాయి. అదృశ్య సైనికులు అనేది రియల్ఎం సైన్స్ ఫిక్షన్ అయినప్పటికీ.. కనిపించకుండా చేసే అధునాతర పరిజ్ఞానం కోసం మిలటరీ పరిశ్రమ కొంతకాలం నుంచి ప్రయత్నిస్తోంది. సైనిక పరికరాలు శత్రువులకు కనిపించకుండా చేయడమే దీని లక్ష్యం. వస్తువులపై పడకుండా కాంతిని వక్రీభవనం చెందించడం ద్వారా విజిబిలిటీని తగ్గించే పదార్థాలు తయారీకి ప్రయత్నిస్తున్నారు. అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, షార్ట్ వేవ్ కాంతిని పరావర్తనం చెల్లించకపోవడం వల్ల వస్తువులను కనిపించకుండా చేస్తారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్రి మైకేల్ ఫడోరావ్ గతేడాది చివర్లోనే వస్తువులను కనిపించకుండా చేసే రియల్ వరల్డ్ అప్లికేషన్ అనే అధునాతన సాంకేతికతను టెలిగ్రామ్ లో ప్రస్తావించారు. రష్యా థర్మల్ ఇమేజింగ్ కంటపడకుండా, ప్రత్యేకించి డ్రోన్ల కంటపడకుండా ఉక్రెయిన్ సైనికుల కోసం రూపొందించిన అదృశ్య వస్త్రాన్ని ఆయన అందులో ప్రదర్శించారు. రష్యా జనవరిలో అదృశ్య సూట్ ను ఆవిష్కరించినట్లు వార్తా సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ తరహా వస్త్రాలు వలన అనేక దేశాలను సులభంగా యుద్ధంలో చేజిక్కించుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.