చాట్ జిపిటీతో చిక్కులు.. ఫేక్ ఆధార్, పాన్ కార్డులు సృష్టించడంలో ఫాస్ట్.!

గత కొన్నాళ్లుగా టెక్నాలజీలో వినూత్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వివిధ రంగాల్లో ఆధునిక టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ మానవులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సాంకేతిక మార్పులు ప్రజలను ఇబ్బందులు పాలు చేసేలా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ హవా నడుస్తోంది. దీని వినియోగం ఇటీవల కాలంలో అన్ని రంగాల్లో పెరుగుతోంది. రోజురోజుకు కొత్త ఏఐ టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఓపెన్ ఏఐ సంస్థ సృష్టించిన చాట్ జిపిటి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

గత కొన్నాళ్లుగా టెక్నాలజీలో వినూత్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వివిధ రంగాల్లో ఆధునిక టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ మానవులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సాంకేతిక మార్పులు ప్రజలను ఇబ్బందులు పాలు చేసేలా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ హవా నడుస్తోంది. దీని వినియోగం ఇటీవల కాలంలో అన్ని రంగాల్లో పెరుగుతోంది. రోజురోజుకు కొత్త ఏఐ టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఓపెన్ ఏఐ సంస్థ సృష్టించిన చాట్ జిపిటి. ఇది విడుదలైనప్పటి నుంచి వినియోగం ఎంత పెరిగిందో గోపిక సమస్యలను అంతే స్థాయిలో లేవనెత్తుతోంది. దీనివల్ల అనేకమైనటువంటి అంతర్గత విషయాలు బయటపడే అవకాశం ఉందన్న ఆందోళనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంటెంట్, ఇమేజ్ సృష్టికి సంబంధించి చాట్ జిపిటి సామర్థ్యం కలవరపెడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. అత్యంత వాస్తవికమైన, ఖచ్చితమైన కంటెంట్ ను సృష్టించే కృత్రిమ మేద సామర్థ్యం గణనీయంగా అభివృద్ధి చెందింది.

ఇది నకిలీ పత్రాలను సులభంగా సృష్టించడానికి వీలు కల్పిస్తున్నట్లు సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. సాంప్రదాయకంగా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు పత్రాలకు నకిలీ వి సృష్టించడం కష్టతరంగా ఉంటుంది. కానీ జిపిటి  4 దీనిని చాలా సులభతరం చేసింది. సమర్థవంతమైన, ఖచ్చితమైన ప్రాంప్టలను ఇవ్వడం ద్వారా మోసగాళ్లు సులభంగా నకిలీ పత్రాలను సృష్టించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్ల చిత్రాలను కొందరు మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ యాక్షన్ పోస్ట్ చేశారు. చాట్ జిపిటి నకిలీ ఆధార్, పాన్ కార్డులను క్షణాల్లో సృష్టిస్తోంది. ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కొంతవరకు నియంత్రించాలని ఒక నిపుణుడు పేర్కొన్నారు. ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదంగా పేర్కొంటున్నారు. అందుకే ఏఐని కొంతవరకు నియంత్రించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆధార్, పాన్ కార్డు డేటా షట్లను ఏఐ కంపెనీలకు అమ్మి అటువంటి నమూనాలను తయారుచేస్తుంది ఎవరు, v ఫార్మాట్ ను అంత కరెక్ట్ గా అది ఎలా తెలుసుకోగలదు అంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరికొంత స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా మారుతున్న టెక్నాలజీ కొన్ని రకాల ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందన్న భావన పలువురు నిపుణులు నుంచి వ్యక్తం అవుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్