ప్రపంచ వ్యాప్తంగా అనేక కేన్సర్లు పడగ విప్పుతున్నాయి. ఏటా కొన్ని లక్షల మంది కేన్సర్ బారినపడి మృత్యువాత చెందుతున్నారు. కొన్ని కేన్సర్ల బారిన ఎందుకు ఎలా పడతారో చాలా మందికి తెలియదు. ఎక్కువ కేన్సర్లు మాత్రం స్వీయ తప్పిదాలు వల్లే వస్తుంటాయి. ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు, దురలవాట్లు కారణంగా ఎంతో మంది కేన్సర్లకు గురవుతుంటాయి.
టాటూ
ప్రపంచ వ్యాప్తంగా అనేక కేన్సర్లు పడగ విప్పుతున్నాయి. ఏటా కొన్ని లక్షల మంది కేన్సర్ బారినపడి మృత్యువాత చెందుతున్నారు. కొన్ని కేన్సర్ల బారిన ఎందుకు ఎలా పడతారో చాలా మందికి తెలియదు. ఎక్కువ కేన్సర్లు మాత్రం స్వీయ తప్పిదాలు వల్లే వస్తుంటాయి. ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు, దురలవాట్లు కారణంగా ఎంతో మంది కేన్సర్లకు గురవుతుంటాయి. అయితే, టాటూ వేసుకోవడం వల్ల కూడా కేన్సర్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాటూతో బ్లడ్ కేన్సర్ ముప్పు ఉందని, శరీరంపై వేసుకునే టాటూలతో లింఫోమా అనే బ్లడ్ కేన్సర్ వచ్చే ముప్పు 21 శాతం వరకు ఉంటుందని స్వీడన్ పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా లింఫోమా బ్లడ్ కేన్సర్ బారినపడిన 2,938 మందితో కలిపి మొత్తంగా 11,905 మందిపై ఈ అధ్యయాన్ని చేశారు. టాటూలు వేసుకోని వారితో పోలిస్తే.. వేసుకున్న వారిలో కేన్సర్ కణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు చెబుతున్నారు. అయితే, దీనిపై మరింత లోతైన పరిశోధనను సాగిస్తున్నారు. ముఖ్యంగా స్పెషల్ అట్రాక్షన్ కోసం ఎక్కువగా టాటూలు వేయించుకుంటున్న యువత దీనిపై ఆలోచన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.