నేడు సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్.. 49 స్థానాల్లో ఎన్నికలు

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. దేశంలో లోక్సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు దశల ఎన్నికల ప్రక్రియ ముగియగా, సోమవారం ఐదో దశ పోలింగ్ జరగనుంది. ఐదో దశలో 8 రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 49 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరగనుంది.

పోలింగ్ లో పాల్గొన్న ఓటర్లు
పోలింగ్ లో పాల్గొన్న ఓటర్లు


దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. దేశంలో లోక్సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు దశల ఎన్నికల ప్రక్రియ ముగియగా, సోమవారం ఐదో దశ పోలింగ్ జరగనుంది. ఐదో దశలో 8 రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 49 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరగనుంది. పోలింగ్ నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసింది. ఐదో దశ పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో పలు పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల స్థానాలు ఉన్నాయి. సోమవారం పోలింగ్ జరగనున్న రాష్ట్రాలు, స్థానాలను పరిశీలిస్తే.. జార్ఖండ్ లో మూడు, ఒడిశాలో ఐదు, ఉత్తరప్రదేశ్లో 14, బీహార్ లో ఐదు, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో ఏడు, లద్ధాకులో ఒకటి, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ 49 స్థానాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొననుంది. రెండు కూటముల నుంచి ముఖ్య నాయకులకు చెందిన స్థానాలు ఈ ఐదో దశ పోలింగ్ లో ఉండడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రాయబరేలి నియోజకవర్గం నుంచి ఈసారి ఆమె తనయుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గతంలో పోటీ చేసిన అమేది నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కే ఎల్ శర్మ పోటీ చేస్తున్నారు. ఈయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఢీకొంటున్నారు. అయోధ్య రామ మందిరం కొలువై ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బిజెపి నేత లల్లు సింగ్, ఎస్పీ నేత అవదేశ్ ప్రసాద్ మధ్య పోటీ నడుస్తోంది. లక్నౌలో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, ఎస్పీ నేత రవిదాస్ మెరహోత్రా మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఐదో దశ పోలింగ్లో బిజెపికి అత్యంత కీలకమైన మహారాష్ట్రలోని 14 స్థానాల్లో కమల్నాదులకు ప్రతికూల పవనాలు వీస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో కనీసం ఏడు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండుగా చీలిపోయిన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఎవరిది నిజమైన పార్టీగా ప్రజలు గుర్తిస్తారో ఈ ఎన్నికల్లో తేలనుంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో సహా పలువురు బిజెపి నేతలు ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. బీహార్ లో ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య.. బిజెపి దిగ్గజం రాజీవ్ ప్రతాప్ రూడీకి గట్టి పోటీ ఇస్తున్నారు. లోక్ జనశక్తి నేత చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్ నుంచి ఎన్డీఏ తరఫున పోటీ చేస్తుండగా, ఆయన ప్రత్యర్థిగా లాలు కుడి భుజంగా వ్యవహరిస్తున్న శివ చంద్రరామ్ బరిలో ఉన్నారు. వీటితోపాటు అనేక స్థానాల్లో ఇరు కూటములకు చెందిన ముఖ్య నాయకులు పోటీ పడుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్