పాకిస్థాన్‌పై పైచేయి సాధిస్తున్న టైంలో భారత్ ఉన్నంట్టుండి ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించింది? యుద్ధం ఎందుకు ఆపేసింది? యుద్ధం కొనసాగితే అసలు పాకిస్థాన్ పని ఏంటో తేలిపోతుండే కదా..! ఉన్న సందేహాలు చాలా మందిలో కలిగాయి. అసలు వాస్తవం ఏంటి?
పాకిస్థాన్‌లోని కిరానాహిల్స్ ప్రాంతం
పాకిస్థాన్‌పై పైచేయి సాధిస్తున్న టైంలో భారత్ ఉన్నంట్టుండి ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించింది? యుద్ధం ఎందుకు ఆపేసింది? యుద్ధం కొనసాగితే అసలు పాకిస్థాన్ పని ఏంటో తేలిపోతుండే కదా..! ఉన్న సందేహాలు చాలా మందిలో కలిగాయి. అసలు వాస్తవం ఏంటి? అన్నది ఎవరికీ తెలియదు. తెలిసినవాళ్లూ చెప్పరు. అంతా గందరగోళంగా మారింది పరిస్థితి. అయితే, భారత్ కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది? అంటే.. అసలు కారణం.. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న సర్గోదా జిల్లా కిరానా హిల్స్ ప్రాంతమే. ఈ కిరానా హిల్స్ అనే ప్రాంతం పాకిస్థాన్‌లో అత్యంత రహస్యంగా ఉండే ప్రదేశం. కిరానా హిల్స్‌ను అమెరికాలోని ఏరియా-51 (Area 51)తో పోలుస్తారు. రెండు చోట్ల ఆయా ప్రాంతాలను నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అంటే.. ఆ ప్రాంతంలోకి అతి ముఖ్యమైన మిలటరీ అధికారులు మినహా ఎవరూ ఆ దరిదాపుల్లోకి వెళ్లకూడదు.
కిరానా హిల్స్ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చేస్తారు. అందుకే కిరానా హిల్స్ గురించి ఎవరికీ తెలియదు. ఈ ప్రాంతం పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ ఆధీనంలో ఉంటుంది. కిరానా హిల్స్ ప్రాంతాన్ని బ్లాక్ హిల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి తక్కువ ఎత్తులో ముదురు గోధుమ రంగులో 12 కిలోమీటర్లు వరకూ వ్యాపించి ఉంటాయి. ఇక్కడి కొండ రాళ్లన్నీ పదునుగా ఉంటాయి. అంటే.. ఎవరూ నడిచి వెళ్లలేని పరిస్థితి. అందుకే పాకిస్థాన్ మిలిటరీ.. కోవర్ట్ ఆపరేషన్స్ కోసం వాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. 1980 నుంచి ఆ ప్రాంతాన్ని మిలిటరీ ఆపరేషన్స్ కోసమే వాడుకొనేలా అభివృద్ధి చేశారు.
1980లోనే చుట్టుపక్కల ఉండే ప్రజలను 15 కిలోమీటర్లు దూరంగా ఉండేలా భద్రత ఏర్పాటు చేశారు. అక్కడ భూగర్భ బంకర్లు, సొరంగాల నిర్మాణం మొదలుపెడితే 1990లో పూర్తయింది. కిరానా హిల్స్‌ను అనుసంధానం చేస్తూ ముషాఫ్ ఎయిర్ బేస్ నిర్మించారు. దాంతో ఈ ప్రాంతంపై అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఎవరి వద్దా కచ్చితమైన సమాచారం లేదు. అయితే.. 1965లో భారత్ - పాక్ యుద్ధ సమయంలో కిరానా హిల్స్‌పై భారత యుద్ధ విమానాలు బాంబులు వేశాయి. దాదాపు 10 పాక్ యుద్ధ విమానాలు పార్కింగ్‌లోనే బాంబు దాడులతో ధ్వంసం అయ్యాయి. 1983-1990 మధ్య పాకిస్థాన్ అణు శాస్త్రవేత్త అబ్దుల్ ఖాదిర్ నేతృత్వంలో పాకిస్థాన్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ కోల్డ్ టెస్ట్/సబ్ క్రిటికల్ న్యూక్లియర్ పరీక్షను నిర్వహించింది. కోల్డ్ టెస్ట్ అంటే అణుబాంబు డిజైన్ చేసే క్రమంలో శుద్ధిచేసిన యూరేనియంకు బదులు సంప్రదాయ పేలుడు పదార్థాన్ని వాడుతారు.
1998 మే నెలలో చాగై హిల్స్‌లో పాకిప్థాన్ మొదటి అణు పరీక్ష నిర్వహించింది. అప్పుడే చాగై హిల్స్ గురించి ప్రపంచానికి తెలిసింది కానీ.. కిరానా హిల్స్ గురించి ఎవరికీ తెలియదు. అణు పరీక్ష విజయవంతమయ్యాక ముషాఫ్ ఎయిర్ బేస్‌ను ఎయిర్ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేశారు. దాన్ని కిరానా హిల్స్‌తో అనుసంధానం చేశారు. అక్కడే సొరంగాలు తవ్వి అందులో అణు వార్ హెడ్లను భద్రపరిచారు. ఒకవేళ భారత్‌తో యుద్ధం తీవ్రతరమైతే.. కిరానా హిల్స్‌లో ఉన్న సొరంగాల నుండి అణు వార్ హెడ్లను బయటికి తెచ్చి, వాటిని మిసైల్స్ తో అనుసంధానం చేసి, అక్కడి నుంచి విమానాల్లో తరలించడానికి ముషాఫ్ ఎయిర్ బేస్‌ను అభివృద్ధి చేశారు. అంటే సొరంగం నుంచి నేరుగా ఎయిర్ కాంప్లెక్స్‌లోకి దారి ఉంటుంది. కాబట్టి శాటిలైట్‌కు కనిపించదు.
ఇప్పుడెలా బయటపడిందంటే.. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని అన్ని ప్రధాన వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. అందులో సర్గోదా ఎయిర్ బేస్, నుర్ ఖాన్ ఎయిర్ బేస్‌లు కూడా ఉన్నాయి. అయితే.. సర్గోద వద్ద రేడియేషన్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దాంతో తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడింది. సర్గోదా, నుర్ ఖాన్ ఎయిర్ బేస్‌లలో F-16, JF-17, జెట్ ఫైటర్స్‌ను నిలిపి ఉంచినందుకే భారత్ దాడి చేసింది. అయితే.. సర్గోదా ఎయిర్‌బేస్‌కు 20 కిలోమీటర్ల పరిధిలోనే కిరానాహిల్స్ ఉంది. ఆ పేలుడు ధాటికి.. కిరానా హిల్స్‌లోని భూగర్భ సొరంగాల్లో ఉన్న అణు వార్ హెడ్స్ దెబ్బతిని రేడియేషన్ బయటికి వచ్చింది. దాంతో భయపడ్డ పాకిస్థాన్ కాల్పుల విరమణ కోసం కాళ్ల బేరానికి వచ్చింది. వెంటనే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌కు కాల్ చేసి భారత్ దాడులు ఆపించేలా వేడుకుంది. భారత్ దాడులు ఆపితే తాము రేడియేషన్ లీక్‌పై పరీక్షలు నిర్వహించుకుంటామని వేడుకున్నది. రేడియేషన్ అనడంతో కాల్పుల విరమణకు ప్రధాని మోదీ ఒప్పుకున్నారు. ఒకవేళ.. ముషాఫ్ ఎయిర్ కాంప్లెక్స్‌పై భారత్ దాడి చేసి ఉంటే విచ్చలవిడిగా రేడియేషన్ వ్యాప్తి చెంది పాకిస్థాన్ సహా పక్క దేశాల్లో మృత్యువు తాండవం చేసేది.
ఇంకో విషయం ఏంటంటే.. విమాన రాకపోకలను రికార్డ్ చేసే Flightradar24 సంస్థ.. అమెరికన్ బీచ్ క్రాఫ్ట్ B350 విమానం పాకిస్థాన్ గగనతలంలో ఎగరడాన్ని గుర్తించింది. బీ350 విమానం అమెరికా డిపార్ట్మెంట్ అఫ్ ఎనర్జీ సంస్థది. ఆ విమానంలో ఏరియల్ మీజరింగ్ సిస్టమ్ సదుపాయం ఉంటుంది. దాంతో.. భూమి మీద ఉండే రేడియేషన్, దాని తీవ్రత, ఎంతవరకూ రేడియేషన్ వ్యాపించింది అనేవి తెలుసుకోవచ్చు. జపాన్‌లో సునామి వచ్చినపుడు ఫుకుషిమ అణు రియాక్టర్ నుంచి వెలువడ్డ రేడియేషన్‌ను గుర్తించేందుకు ఈ విమానాన్నే వాడారు. అలాంటి విమానాన్నే 2010లో పాకిస్థాన్‌కు అమెరికా అందజేసింది. అదికాకుండా.. ఈజిప్ట్ నుంచి మరో విమానం పాకిస్థాన్‌లో లాండ్ అయ్యి కొద్దిసేపటి తరువాత తిరిగి వెళ్లిపోయింది. ఈజిప్ట్ నుంచి వచ్చిన ఆ విమానంలో బోరాన్ అనే కెమికల్ తీసుకొచ్చారు. దానిని పాకిస్థాన్‌లో అన్ లోడ్ చేసి వెళ్లిపోయిందా విమానం. బోరాన్ కెమికల్‌ను అణు వ్యర్ధాలను సురక్షితంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. అంటే.. రేడియేషన్ తీవ్రతను కొలిచి అది లీక్ అవుతున్నదని గుర్తించి, బోరాన్‌తో లీకేజిని ఆపారు. దీనికోసమే కాల్పులు ఆపాలని పాక్ అభ్యర్థించడంతో.. మానవతా దృక్పధంతో కాల్పుల విరమణకు మోదీ ఒప్పుకున్నారు. ఇదీ జరిగింది.