ఒమన్ రాజధాని మస్కట్‌లో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
మస్కట్ (ప్రతీకాత్మక చిత్రం)
మస్కట్: ఒమన్ రాజధాని మస్కట్‌లో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో ఒక భారతీయుడు, నలుగురు పాకిస్థానీ జాతీయులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. దుండగుల్లో ముగ్గురిని కాల్చి చంపామని ఒమన్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. మస్కట్‌లోని వాడీ కబీర్ ప్రాంతంలోని ఇమామ్ అలీ మసీద్ బయట ఓ మతపరమైన వేడుకలు చేసుకుంటుండగా, దుండగులు కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు.
కాల్పుల్లో మృతిచెందిన భారతీయుడి కుటుంబానికి అన్ని సహాయాలు అందిస్తామని మస్కట్‌లోని భారతీయ ఎంబసీ వెల్లడించింది. గాయపడినవారిలో 20 మంది పాకిస్థానీ పౌరులు ఉన్నారని ఆ దేశ రాయబారి పేర్కొ్న్నారు.