మెలోనీ.. మోదీతో సెల్ఫీ వీడియో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు ‘హాయ్ ఫ్రెండ్స్.. ఫ్రం మెలోడీ’ అని క్యాప్షన్ పెట్టారు.
మెలోడీ Photo: Facebook
న్యూఢిల్లీ, ఈవార్తలు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీ కలిశారంటే చాలు.. మీడియా చూపు, అంతర్జాతీయ ప్రముఖులు చూపు వీరిద్దరిపైనే ఉంటుంది. వీరిద్దరు ఎప్పుడు కలిసినా.. ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు. వీరిద్దరిని కలిపి Melodi (మెలోడీ)గా అభివర్ణిస్తుంటారు. తాజాగా, జీ7 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ అతిథిగా ఇటలీకి వెళ్లారు. దీంతో మీడియా చూపంతా మోదీ, మెలోనీ వైపు తిరిగింది. దీన్ని గుర్తించిన మెలోనీ.. మోదీతో సెల్ఫీ వీడియో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు ‘హాయ్ ఫ్రెండ్స్.. ఫ్రం మెలోడీ’ అని క్యాప్షన్ పెట్టారు.
ఈ వీడియోలో మెలోనీ వెనకాల మోదీ నవ్వులు చిందించారు. దాంతో ఒక్కసారిగా #melodi ట్యాగ్ వైరల్ అయ్యింది. అన్ని వర్గాల ప్రముఖులు ఈ వీడియోలో ఫొటోను క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ సెల్ఫీ వీడియోపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ తదితరులు స్పందించారు. సైనా నెహ్వాల్ బ్యూటిఫుల్ పిక్ అని పేర్కొంది.