ఇరాన్ పై మెరుపు దాడులు చేసిన ఇజ్రాయిల్.. సైనిక స్థావరాలు లక్ష్యంగా మిస్సైల్స్

ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్నాయి. గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఇరుదేశాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా శనివారం ఉదయం ఇరాన్ సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ వైమానిక దాడులను జరిపింది. ఇరాన్ రాజధాని టెహ్రన్ లో భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయి.

Israel and Iran war

ఇజ్రాయిల్, ఇరాన్ 

ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్నాయి. గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఇరుదేశాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా శనివారం ఉదయం ఇరాన్ సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ వైమానిక దాడులను జరిపింది. ఇరాన్ రాజధాని టెహ్రన్ లో భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయి. దీంతోపాటుగా మీపంటెహ్రన్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు ఇరుదేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు స్పందించలేదు. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు సంబంధించి అక్టోబర్ ఒకటో తేదీన ఇజ్రాయిల్ పై భారీగా క్షిపణులను ఉపయోగించింది.

ఇరాన్ సైనిక స్థావరంపై తాజాగా జరిపిన దాడి దానికి ప్రతీకారంగా చేసినట్టుగా భావిస్తున్నారు. ఇజ్రాయిల్ పై ఇరాన్ చేసిన ఆకస్మిక క్షిపణి దాడి వల్ల గణనీయమైన ప్రాణ నష్టం జరగలేదని, ప్రతీకార చర్యలు తప్పకుండా ఉంటాయని ఇజ్రాయిల్ ఆ సమయంలో పేర్కొంది. ఇజ్రాయిల్ పై ఇరాన్ జరిపిన ఈ వైమానిక దాడుల్లో 87 మంది మృత్యువాత చెందినట్లు చెబుతున్నారు. దానికి ప్రతికారంగానే తాజాగా ఇజ్రాయిల్ శనివారం ఉదయం సైనికు స్థావరాలు లక్ష్యంగా భారీగా క్షిపణి దాడులను చేసింది. పది సైనిక స్థావరాలపై ఇజ్రాయిల్ విరుచుకుపడింది. టెహ్రాన్ తో సహా నాలుగు నగరాల్లో ఈ దాడులను ఇజ్రాయిల్ చేసింది. ఈ దాడుల వల్ల ఎంత నష్టం జరిగిందనే దానిని ఇరాన్ ధ్రువీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ దాడులకు సంబంధించి ఇరాన్ నుంచి ఎటువంటి అధికార ప్రకటన వెలువడలేదు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పచ్చిమసియా దేశాల మధ్య ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇరుదేశాల మధ్య నెలకొన్న యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజా దాడుల తరువాత ఇరాన్ ఏవిధంగా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఇరాన్ మరింత గట్టిగా ప్రతిస్పందిస్తే అందుకు ప్రతిగా స్పందించేందుకు కూడా ఇజ్రాయిల్ ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్