మూడో ప్రపంచం యుద్ధం తప్పదా..? ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగితే పరిస్థితి ఏంటి?

హమాస్, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..ఇజ్రాయెల్ పై ఇరాన్ రాకెట్ల వర్షంతో పశ్చిమాన యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

world war

ప్రతీకాత్మక చిత్రం

హమాస్, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..ఇజ్రాయెల్ పై ఇరాన్ రాకెట్ల వర్షంతో పశ్చిమాన యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ నస్రల్లాను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) మట్టుబెట్టడం.. ఆ సంస్థకు చెందిన కీలక నేతలను హతమార్చడంతో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. మంగళవారం రాత్రి ఒక్కసారిగా 150కి పైగా రాకెట్లతో విరుచుకుపడింది. ఈ రాకెట్లను ఇజ్రాయెల్ యూరో ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థ అడ్డుకున్నది.ఇరాన్ నుంచి రాకెట్లు సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా దూసుకురావడంతో ఇజ్రాయెల్ ప్రజలు షెల్టర్స్ లోకి పరుగులు పెట్టారు. ఇరాన్ రాకెట్ల వర్షానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పశ్చిమ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ పై ప్రతీకార చర్యలకు ఇజ్రాయెల్ సిద్ధమవుతుండగా పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది.ఇజ్రాయెల్ కు మద్దతుగా బలగాలను పంపేందుకు అమెరికా సిద్ధమవుతున్నదనే వార్త.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే భయాన్ని పెంచుతున్నది. 

ఇజ్రాయెల్ దాడి కి దిగితే..

ఈ ఏడాది ప్రారంభంలోనే సిరియాపై ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఇందులో ఇరాన్ కు చెందిన కొందరు సైనికులు చనిపోయారు. దీంతో ఇరాన్ తన అమ్ములపొదిలోని అతి శక్తివంతమైన డ్రోన్లు, క్షిపణులతో ప్రతిదాడులకు దిగింది. అయితే, ఇజ్రాయెల్ కు అమెరికా అండగా నిలవడంతో ఇరాన్ తోకముడిచింది. తాజాగా, తమ మద్దతున్న కీలక నేతలను ఇజ్రాయెల్ పొట్టనపెట్టుకున్నది. అటు లెబనాన్, ఇటు పాలస్తీనాపై వైమానిక దాడులు చేసి హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను మట్టుబెట్టింది. దీంతో మరోసారి రగలిపోయిన ఇరాన్.. ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. ఈ దాడలో ఎలాంటి ప్రాణనష్టం జరగకున్నా.. ఇరాన్ ను వదిలేది లేదని ఇజ్రాయెల్ శపథం చేసింది. ఇజ్రాయెల్ కు అగ్రరాజ్యం మద్దతు ఉన్నది. అదే సమయంలో ఇరాన్ ను ఇదివరకే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య గనుక ఉద్రిక్తతలు తీవ్రమైతే అమెరికాతోపాటు వెస్ట్రన్ కంట్రీస్ రంగంలోకి దిగే అవకాశముంది. దీంతో యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించడంతోపాటు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే భయాందోళనలు నెలకున్నాయి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్