ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లే దేశాల్లో భారతదేశం మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా వెలువడిన ఈ నివేదిక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. జాబితాలో మొదటి రెండు స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉండగా.. మూడో స్థానంలో భారతదేశం నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాల్లో భారతదేశం మూడో స్థానంలో ఉన్నట్లు రియల్ టైం గాలి నాణ్యత వివరాలను అందజేసే ఓపెన్ సోర్స్ సంస్థ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) వెల్లడించింది. 2024వ సంవత్సరంలో సగటు ఏక్యూఐ 145 తో బంగ్లాదేశ్ అత్యంత కాలుష్య కారక దేశాల్లో మొదటి స్థానంలో నిలిచింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లే దేశాల్లో భారతదేశం మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా వెలువడిన ఈ నివేదిక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. జాబితాలో మొదటి రెండు స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉండగా.. మూడో స్థానంలో భారతదేశం నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాల్లో భారతదేశం మూడో స్థానంలో ఉన్నట్లు రియల్ టైం గాలి నాణ్యత వివరాలను అందజేసే ఓపెన్ సోర్స్ సంస్థ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) వెల్లడించింది. 2024వ సంవత్సరంలో సగటు ఏక్యూఐ 145 తో బంగ్లాదేశ్ అత్యంత కాలుష్య కారక దేశాల్లో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన పాకిస్తాన్ 115 ఏక్యూఐతో ఉంది. 11 గాలి నాణ్యతతో భారతదేశం మూడో స్థానంలో ఈ జాబితాలో నిలిచింది. టాప్-10లో ఉన్న దేశాలను పరిశీలిస్తే బహ్రెయిన్ (103)తో నాలుగో స్థానంలో నిలిచింది. నేపాల్ 100 ఏక్యూఐతో ఐదో స్థానంలో నిలిచింది. ఈజిప్టు 92 ఏక్యూఐ ఆరో స్థానంలో, కిర్గిస్తాన్ 87 తో ఎనిమిదో స్థానంలో ఉంది. ఏక్యూఐ 50లోపు ఉంటే కాలుష్య పరంగా సురక్షిత దేశాలుగా పరిగణిస్తారు.
ఒక్క ఈజిప్టు మినహా టాప్ - 10 లో ఆసియా దేశాలో ఉండడం గమనార్హం. ఏక్యూఐ విడుదల చేసిన టాప్ -50 కాలుష్య నగరాల్లో సింహభాగం ఉత్తర భారత దేశంలోనే ఉన్నాయి. దేశంలోని రాష్ట్రాలు వారీగా పరిశీలిస్తే కాలుష్య కారకాల్లో అత్యంత దారుణంగా ఉన్న రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే టాప్ 12 స్థానాలను భారత్ ఆక్రమించినట్లు అయిందని నిపుణులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 169 ఏక్యూఐతో ముందంజలో ఉంది. తర్వాత స్థానంలో గ్రేటర్ నోయిడా 166 ఏక్యూఐతో రెండో స్థానంలో నిలిచింది. ఏక్యూఐ డేటా పరంగా భారతదేశంలోని దక్షిణాది నగరాలు కొంతవరకు సురక్షితమైనవే అయినా రియల్ టైం డేటాలో మాత్రం దక్కన్ పీఠభూమి దిగు ప్రాంతాలు టాప్ లో ఉంటున్నాయి. ప్రపంచంలోనే సర్వేకంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉన్న భారత కాలుష్యకారక దేశాల్లో టాప్-3లో ఉండడం పట్ల సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా అనేక నగరాలు కాలుష్యకారకంగా మారుతున్నాయి. నగరంలో జనాభా పెరుగుతుండడం, గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు, చెట్లు వంటివి తగ్గుతుండడం కూడా కాలుష్యానికి కారణం అవుతున్నాయి.