కేసు విచారణ సందర్భంగా సాక్షాలుగా ప్రదర్శించే రేప్ వీడియోలను ప్రజలు కూడా చూసేందుకు అనుమతిచ్చింది.అయితే, ఆ సమయంలో సెన్సిటివ్ పర్సన్స్, మైనర్లు కోర్టు పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలని సూచించింది.
ప్రతీకాత్మక చిత్రం
ఈ వార్తలు, హైదరాబాద్: భార్య మానప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన భర్తే.. ఆమెపై పాశవికంగా వ్యవహరించాడు. ఆమె నిద్రపోతున్నప్పుడు మత్తు మందు ఇచ్చి ఆమెపై 72 మందితో 92 సార్లు అత్యాచారం చేయించాడు. వారు రేప్ చేస్తుండగా.. ఫొటోలు, వీడియోలు షూట్ చేశాడు. ఫ్రాన్స్ లో జరిగిన ఈ అమానవీయ, ఘోర ఘటన ఇటీవల సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో అక్కడి స్థానిక కోర్టు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ కేసు విచారణ సందర్భంగా సాక్షాలుగా ప్రదర్శించే రేప్ వీడియోలను ప్రజలు కూడా చూసేందుకు అనుమతిచ్చింది.అయితే, ఆ సమయంలో సెన్సిటివ్ పర్సన్స్, మైనర్లు కోర్టు పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలని సూచించింది. ఈ కేసులో నిజానిజాలను వెలికితీసే క్రమంలో అవసరమైతేనే ఆ వీడియోలను ప్రదర్శిస్తామని కోర్టు తెలిపింది.
ఈ కేసులో భర్త ఎలా దొరికాడంటే?
నిందితుడు ఫ్రాన్సులోని ఓ గవర్నమెంట్ సెక్టార్ ఆఫీస్ ఉద్యోగి. భార్యకు ప్రతిరోజూ రాత్రి అన్నంలో డ్రగ్స్ ఇచ్చేవాడు. ఆమె మత్తులోకి జారుకోగానే కొందరిని ఇంటికి పిలిచేవాడు. వాళ్లు తన భార్యపై రేప్ చేస్తుండగా సీక్రెట్ కెమెరాల్లో బంధించేవాడు. ఇలా పదేండ్లపాటు భార్యపై పాశవికంగా వ్యవహరించాడు. అయితే, 2020లో నిందితుడు ఓ షాపింగ్ మాల్ లో అమ్మాయిల ఫొటోలు, వీడియోలు తీస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. అతడి ఫోన్, కంప్యూటర్ ను చెక్ చేయగా, అసలు బండారం బయటపడింది. వీడియోల ఆధారంగా నిందితుడి భార్యను రేప్ చేసిన 51 మంది ఆచూకీని పోలీసులు గుర్తించారు. మిగతావారు దొరకలేదు. కాగా, ఈ కేసును ఓపెన్ ఎంక్వైరీ చేయాలని బాధితురాలు కోరడంతో కోర్టు అంగీకరించింది.ఇలాంటి వాటిపై మహిళలకు అవగాహన కల్పించేందుకు వీడియోలను ప్రజలు చూసేందుకు అనుమతి ఇచ్చింది.