Elon Musk | కెనడా ప్రధాని ట్రూడోపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..

‘రాబోయే కెనడా ఫెడరల్ ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతాడు’ అని రిప్లై ఇచ్చాడు. ట్రంప్ గెలుపు కోసం ఎంతో కష్టపడిన మస్క్.. ట్రూడోపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారాయి.

musk trudeau

మస్క్, ట్రూడో

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ Donald Trump విజయం సాధించడంతో జోష్ మీద ఉన్న ఆయన మద్దతుదారుడు ఎలాన్ మస్క్ Elon Musk ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో Justin Trudeau పై మస్క్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వచ్చే ఏడాది కెనడాలో జరిగే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఓ యూజర్ ఎక్స్‌లో.. ట్రంప్ విక్టరీ నేపథ్యంలో కెనడా ప్రధాని ట్రూడోను వదిలించుకోవడానికి కెనడాకు సాయం చేయండి అని మస్క్‌కు విజ్ఞప్తి చేశాడు. దీంతో.. ‘రాబోయే కెనడా ఫెడరల్ ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతాడు’ అని రిప్లై ఇచ్చాడు. ట్రంప్ గెలుపు కోసం ఎంతో కష్టపడిన మస్క్.. ట్రూడోపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారాయి. మస్క్ వ్యాఖ్యల ప్రభావం కెనడాలో లిబరల్ పార్టీపై బాగానే పడుతుందని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.

ఇక, భారత్‌పై నిప్పులు గక్కుతున్న ట్రూడో ఓడిపోతాడు అని మస్క్ చెప్పడంపై భారతీయులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ను బదనాం చేయాలనుకునే వారికి అలానే జరగాలని శాపం పెడుతున్నారు. భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ట్రూడోకు తెలిసివస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ట్రూడో తీరుపై ఆయన సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పార్టీ ఓటమి చెందుతుందని, దానికి బాధ్యతగా ముందే రాజీనామా చేయాలని లిబరల్ పార్ట ఎంపీలు అల్టిమేటం జారీ చేశారు.

ఇదిలా ఉండగా.. ట్రూడో వరుసగా మూడు సార్లు అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గత ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. అయితే, పూర్తి మెజారిట దక్కకపోవటంతో మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 338 పార్లమెంట్ స్థానాలు ఉండగా, ట్రూడో పార్టీకి 153 మంది ఎంపీలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థాయిలో సీట్లు వచ్చే అవకాశం లేదని.. ట్రూడో ఓటమి పక్కా అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్