Elon Musk : టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొంపలు ముంచిన ఘనుడు. ఏకంగా ప్రాణ స్నేహితుడి భార్యతోనే అఫైర్ నడిపిన వ్యక్తి. ఈ మాటలను రుజువు చేస్తున్నది ఓ మీడియా సంస్థ కథనం. ప్రస్తుతం ఇదే అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఎలాన్ మస్క్, నికోల్ షానన్, సెర్గీ బ్రిన్
Elon Musk : టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొంపలు ముంచిన ఘనుడు. ఏకంగా ప్రాణ స్నేహితుడి భార్యతోనే అఫైర్ నడిపిన వ్యక్తి. ఈ మాటలను రుజువు చేస్తున్నది ఓ మీడియా సంస్థ కథనం. ప్రస్తుతం ఇదే అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. తన ప్రాణ స్నేహితుడు, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాజీ భార్య నికోల్ షానన్‌తో ఎలాన్ మస్క్ శారీరక సంబంధం నడిపినట్లు ఆ కథనం పేర్కొంది. అసలేం జరిగిందంటే.. సెర్గీ బ్రిన్, ఎలాన్ మస్క్ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. టెస్లా కంపెనీ తయారు చేసిన తొలి మోడల్ కారును అందుకున్నవారిలో సెర్గీ బ్రిన్ ఒకరు. కరోనా సమయంలో ఎలాన్ మస్క్‌కు సెర్గీ ఆర్థిక సాయం కూడా చేశారు. అయితే, వీరిద్దరి మధ్య స్నేహం తెగిపోవటానికి నికోల్ షానన్‌తో మస్క్ పెట్టుకొన్న శారీరక సంబంధమే కారణమని మీడియా కథనం స్పష్టం చేస్తోంది.
2021లో సెర్గీ తన భార్య బర్త్ డే పార్టీని ఏర్పాటు చేశాడు. దానికి మస్క్ హాజరయ్యారు. ఆ పార్టీలో నికోల్ షానన్, మస్క్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తర్వాత మళ్లీ కొన్ని రోజులకు మస్క్ సోదరుడు మియామీ మస్క్ ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ పార్టీకి నికోల్ వచ్చింది. ఆ టైంలో వీరిద్దరు కెటామైన్ డ్రగ్ తీసుకొని, చాలా సేపు కనిపించకుండా పోయారు. చాలా సేపటికి ప్రత్యక్షమయ్యారు. ఆ టైంలోనే వారిద్దరు శారీరకంగా కలిశారని తెలిసింది. నికోల్ తన భర్త సెర్గీ ముందు నిజం ఒప్పుకుంది. తన చుట్టాలతోనూ నిజాన్ని చెప్పింది. దాంతో సెర్గీ-నికోల్ దూరమయ్యారు. విడివిడిగా ఉండి, ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇలా ఎలాన్ మస్క్ తన ప్రాణ స్నేహితుడి కాపురాన్ని కూల్చడమే కాకుండా, తన స్నేహ బంధాన్ని పోగొట్టుకున్నాడు అని మీడియా కథనం పేర్కొంది.