Donald Trump | అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఓటమి తర్వాత మళ్లీ గెలుపొందిన అధ్యక్షుడిగా చరిత్ర లిఖించారు. 1800ల్లో గ్రోవర్ క్లెవెలాండ్ తర్వాత ట్రంప్ మాత్రమే ఆ ఘనత సాధించారు.

donald trump
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఓటమి తర్వాత మళ్లీ గెలుపొందిన అధ్యక్షుడిగా చరిత్ర లిఖించారు. 1800ల్లో గ్రోవర్ క్లెవెలాండ్ తర్వాత ట్రంప్ మాత్రమే ఆ ఘనత సాధించారు. తాజా గెలుపుతో అమెరికా 47వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణం చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ‘అమెరికా ఇలాంటి విజయాన్ని ఎన్నడూ చూడలేదు. రాజకీయ మార్పు మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తుంది. అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతోంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు పోరాడారు. ఇది అతి పెద్ద రాజకీయ ఉద్యమం. దేశ ప్రజలకు కృతజ్ఞతలు. ఇక నుంచి ప్రతి క్షణం మీ కోసం, మీ కుటుంబం కోసం పోరాటం చేస్తా. రాబోయే రోజుల్లో సరిహద్దు సమస్యను పరిష్కరిస్తా’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ వెంట ఆయన భార్య మెలానియా, చిన్న కుమారుడు బారన్ ఉన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్