ఓట్ల కోసం డొనాల్డ్ ట్రంప్ కొత్త అస్త్రం.. హిందువులకు మద్దతుగా వరుస ట్వీట్లు

రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ట్వీట్లు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ అప్‌డేట్ పేరుతో వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉన్న ట్విట్టర్ ఖాతాలో గత 24 గంటల్లో పలు ట్వీట్లు హిందువులకు మద్దతుగా ట్వీట్ చేయడం ఆసక్తిని పెంచుతున్నాయి.

trump edited pic

ట్రంప్ ఎడిటెడ్ పిక్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హ్యారిస్ గెలుస్తారా? రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారా? అని సర్వత్రా ఉత్కంఠ నడుస్తోంది. అయితే, ఎవరి గెలుపు ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ట్వీట్లు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ అప్‌డేట్ పేరుతో వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉన్న ట్విట్టర్ ఖాతాలో గత 24 గంటల్లో పలు ట్వీట్లు హిందువులకు మద్దతుగా ట్వీట్ చేయడం ఆసక్తిని పెంచుతున్నాయి. ఒక ఫొటో మోదీ, ఆదిత్యనాథ్ ఫొటోలకు బదులుగా.. ట్రంప్, ఎలాన్ మస్క్ ఫొటోలు ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నట్టుగా ఉండగా, ఇంకో ఫొటోలో ఎలాన్ మస్క్ సాధు వేషంగా ఉండగా, ట్రంప్ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ప్రజలకు అభివాదం చేస్తున్నట్టుగా ఎడిట్ చేసిన ఫొటోలు పోస్ట్ చేశారు.

భారతదేశంలోని హిందూ కమ్యూనిటీ అంతా ట్రంప్ గెలవాలని పూజలు చేస్తున్నారని పేర్కొంటూ.. దానికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. అంతేకాదు.. 75 శాతం మంది భారతీయులు, 0.25 శాతం మంది బంగ్లాదేశీయులు ట్రంప్‌నకు మద్దతు ఇస్తున్నారని వెల్లడించారు. ఇక మరో ట్వీట్‌లో.. హిందూ ఆలయంలో జరిగిన దాడికి వ్యతిరేకంగా భారతీయ హిందువులు చేపట్టిన నిరసనలో కెనడా పోలీసులు వారిని అరెస్టు చేసే వీడియోను పోస్ట్ చేస్తూ.. హిందూ వ్యక్తిపై కెనడా పోలీసులు దాడి చేస్తున్నారని, నిజంగా దారుణం అని కామెంట్ పెట్టారు. ఇక.. ఇంకో ట్వీట్‌లో.. ట్రంప్, చీరకట్టులో ఆయన భార్య మెలానియా, ఎలాన్ మస్క్ కలిసి హిందూ సంప్రదాయబద్ధంగా భోజనం చేస్తున్న ఎడిటెడ్ ఫొటోను పోస్ట్ చేసి, ఎవరు ఎడిట్ చేశారు? అద్భుతంగా ఉంది అంటూ కామెంట్ జత చేశారు. (వాస్తవానికి అమిత్ షా తదితరులు భోజనం చేసిన ఫొటో అది)

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారాయి. హిందువుల ఓట్లకు గాలం వేసేందుకు ట్రంప్ గొప్ప టాక్టిక్ ప్లే చేశారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఫొటోలు ట్రంప్‌కు కలిసి వస్తాయని పేర్కొంటున్నారు. కాగా, మోదీ మద్దతుదారులు చాలా మంది ట్రంప్ గెలవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హిందువుల ఓట్లు ఆటోమెటిక్‌గా ట్రంప్‌కే పడతాయని ట్రంప్ మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ హయాంలో మోదీ సర్కారుతో ఆయన నెరిపిన స్నేహ బంధం హిందూ కమ్యూనిటీని ట్రంప్‌నకు దగ్గర చేసిందని పేర్కొంటున్నారు. అయితే, కమలా హ్యారిస్ భారతీయ మూలాలున్న వ్యక్తి అని.. ఆమెకే మద్దతు ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి మరి.. ఎవరి గెలుపు భారత్‌కు కలిసి వస్తుందో...!


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్