ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్రీడాకారుల్లో ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ అత్యంత సంపన్న క్రీడాకారుడిగా ఇప్పటికే పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న రొనాల్డో మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. తన పేరుతో సరికొత్త రికార్డును సృష్టించి ఎవరికీ అందనంత ఎత్తులో నిల్చున్నారు. సామాజిక మాధ్యమాలన్నిటిలో కలిపి 100 కోట్లకు పైగా ఫాలోవర్స్ ను సాధించిన తొలి వ్యక్తిగా పోర్చుగల్ కు చెందిన ఈ ఫుట్బాల్ క్రీడాకారుడు నిలిచాడు. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంసమైన విషయంగా మారింది.
క్రిస్టియానో రొనాల్డో
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్రీడాకారుల్లో ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ అత్యంత సంపన్న క్రీడాకారుడిగా ఇప్పటికే పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న రొనాల్డో మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. తన పేరుతో సరికొత్త రికార్డును సృష్టించి ఎవరికీ అందనంత ఎత్తులో నిల్చున్నారు. సామాజిక మాధ్యమాలన్నిటిలో కలిపి 100 కోట్లకు పైగా ఫాలోవర్స్ ను సాధించిన తొలి వ్యక్తిగా పోర్చుగల్ కు చెందిన ఈ ఫుట్బాల్ క్రీడాకారుడు నిలిచాడు. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంసమైన విషయంగా మారింది. 100 కోట్లకు పైగా ఫాలోవర్స్ సాధించిన నేపథ్యంలో స్పందించిన క్రిస్టియానో రొనాల్డో అభిమానులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ' మనం చరిత్ర సృష్టించాం. 100 కోట్ల ఫాలోవర్లు. ఇది కేవలం సంకి మాత్రమే కాదు అంతకుమించిన మీ ప్రేమాభిమానాలకు నిదర్శనం' అంటూ రొనాల్డో పేర్కొన్నారు. మడైరా వీధుల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వేదికల వరకు తాను ఎల్లప్పుడూ తన కుటుంబంతో పాటు అభిమానుల కోసమే ఆడానంటూ ఈ సందర్భంగా రొనాల్డో వెల్లడించారు. ఇప్పుడు 100 కోట్ల మంది అభిమానులు తనకోసం నిలబడ్డారని, తన ఎత్తు పల్లాల్లో, ప్రతి అడుగులోనూ మీరున్నారంటూ భావోద్వేగంతో రొనాల్డో వ్యాఖ్యానించారు. ' ఇది మన ప్రయాణం. మనమంతా కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాం. నాపై విశ్వాసం ఉంచి నాకు ఎల్లవేళలా అండగా ఉన్నందుకు, నా జీవితంలో భాగమైనందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేనింకా ఉత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంది. మరిన్ని విజయాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలి' అని రొనాల్డో తన సామాజిక ఖాతాల్లో రాసుకువచ్చారు. ఇదిలా ఉంటే రొనాల్డో యూట్యూబ్లోకి అడుగు పెట్టగానే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సగం రోజులోనే ఫాలోవర్ల సంఖ్య కోటి దాటింది. ప్రస్తుతం అతడు యూట్యూబ్ ఖాతాకు ఆరు కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో ఈ ఫుట్బాల్ స్టార్ ను 63.9 కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. ఎక్స్ లో 11.3 కోట్ల మంది, ఫేస్బుక్లో 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలోనే 100కోట్ల మంది సామాజిక మాధ్యమాలు ఫాలోవర్లను కలిగిన ఏకైక క్రీడాకారుడే కాకుండా తొలి వ్యక్తిగా రొనాల్డో నిలిచారు.
ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ఫాలోవర్స్ లో చరిత్ర సృష్టించిన రొనాల్డ్ ను పలువురు అభినందిస్తున్నారు. చరిత్రలో మరెవరికి సాధ్యం కానీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు కెరియర్లో 900 గోల్స్ కొట్టిన ఏకైక ఆటగాడిగా రొనాల్డో నిలిచాడు. ప్రస్తుతం ఆయన ఖాతాలో 901 గోల్స్ ఉన్నాయి. ఈ తరం ఫుట్బాల్ ఆటగాళ్లలో లియోనాల మెస్సి తో సమానంగా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన 39 ఏళ్ల రొనాల్డో కెరియర్లో పోర్చుగల్ ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవ లేకపోవడం గమనార్హం. రొనాల్డో సామాజిక మాధ్యమాల ఫాలోవర్స్ సంఖ్య ప్రపంచ జనాభాలో 8వ వంతు ఉండడం గమనార్హం. రొనాల్డో మెస్సికి 50 కోట్ల మంది ఫాలోవర్లు సామాజిక మాధ్యమాల్లో ఉన్నారు. వీరిద్దరి మధ్య 50 కోట్ల ఫాలోవర్లు తేడా ఉండడం గమనార్హం.