టి20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలో కొన్ని మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. తాజాగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ ను అమెరికా, వెస్టిండీస్ జట్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తొలిసారి ఈ మెగా టోర్నీకి అమెరికా జట్టు ఆతిథ్యం ఇస్తోంది. మ్యాచులు నిర్వహణ కోసం అమెరికా పలుచోట్ల స్టేడియాలు నిర్మించింది.
స్టేడియం కూల్చివేతకు సిద్ధంగా ఉన్న వాహనాలు
టి20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాలో కొన్ని మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. తాజాగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ ను అమెరికా, వెస్టిండీస్ జట్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తొలిసారి ఈ మెగా టోర్నీకి అమెరికా జట్టు ఆతిథ్యం ఇస్తోంది. మ్యాచులు నిర్వహణ కోసం అమెరికా పలుచోట్ల స్టేడియాలు నిర్మించింది. వీటిలో ఒకటి న్యూయార్క్ లో ఉంది. న్యూయార్క్ లో తాత్కాలికంగా నసావ్ క్రికెట్ స్టేడియాన్ని 100 రోజుల్లో శరవేగంగా నిర్మించారు. ఎనిమిది మ్యాచ్లు నిర్వహణ కోసం ఈ స్టేడియాన్ని సిద్ధం చేశారు. బుధవారం అమెరికా, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ తో ఇక్కడ షెడ్యూల్ చేసిన మ్యాచ్లు పూర్తయ్యాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ క్రికెట్ స్టేడియం కనుమరుగు కానుంది. దీంతో ముందుగా నిర్ణయించిన మేరకు స్టేడియం కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు. స్టేడియం వద్ద భారీ క్రేన్లు, బుల్డోజర్లు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 930 ఎకరాల హసన్ హోవర్ పార్కులో 34 వేల సీటింగ్ కెపాసిటీతో ఈ స్టేడియాన్ని కేవలం 100 రోజుల్లో నిర్మించారు. స్టాండ్స్ నిర్మాణం కోసం వినియోగించిన ఇనుపు కమ్మలు తదితరాలను లాస్ వేగాస్ లో జరిగిన ఎఫ్1, గోల్ఫ్ ఈవెంట్ల నుంచి అరువు తెచ్చారు. ఇప్పుడు వీటిని ఊడతీసి మళ్లీ వారికి అప్ప చెప్పేందుకు జోరుగా ఏర్పాటు సాగుతున్నాయి. ఈ స్టేడియంలో ఏర్పాటు చేసిన డ్రాప్ ఇన్ పిచ్ లు మెగా ఈవెంట్ లో భారీ చర్చకు దారి తీసాయి. వికెట్ లో అసమతుల్యమైన బౌన్స్ కారణంగా బ్యాటర్లు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇండో, పాక్ మ్యాచ్ కు ఈ మైదానం కిటకిటలాడిపోయింది. నిర్మాణాలను తొలగించడానికి ఆరు వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే డ్రాప్ ఇన్ పిచ్ లను మాత్రం ఇక్కడే ఉంచనున్నారు.