బంగ్లాదేశ్‌లో అల్లర్లు మొదలైంది ఒక రాజకీయ అంశంపై.. కానీ ఇప్పుడా అల్లర్లు ఒక జాతిని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో సాగుతోంది. హిందూ మైనారిటీలే లక్ష్యంగా తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దించివేసేందుకు మొదలైన అల్లర్లు.. ఇప్పుడు ఆ దేశ మైనారిటీలు అయిన హిందువులు, హిందూ దేవాలయాలపై కొనసాగుతున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
బంగ్లాదేశ్‌లో అల్లర్లు మొదలైంది ఒక రాజకీయ అంశంపై.. కానీ ఇప్పుడా అల్లర్లు ఒక జాతిని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో సాగుతోంది. హిందూ మైనారిటీలే లక్ష్యంగా తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దించివేసేందుకు మొదలైన అల్లర్లు.. ఇప్పుడు ఆ దేశ మైనారిటీలు అయిన హిందువులు, హిందూ దేవాలయాలపై కొనసాగుతున్నాయి. ఏ ఆలయం కనిపిస్తే ఆ ఆలయాన్ని ఛాందసవాదులు ధ్వంసం చేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు మరింత అగ్గి రాజేసింది. ఆయనను అరెస్టు చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం పెద్ద స్కెచ్చే వేసింది. బంగ్లాదేశీ జాతీయ పతాకాన్ని అవమానించారు అని పేర్కొంటూ దేశద్రోహం నేరం మోపింది. అరెస్టు చేసి, బెయిల్ ఇవ్వకుండా కస్టడీకి పంపింది. ఇక.. శాంతికి మూలమైన ఇస్కాన్‌పై నిషేధం విధించనున్నట్లు తెలిపింది. అక్కడి హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ప్రపంచ దేశాల్లో లక్షల మందికి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ, శాంతి ప్రవచనాలు బోధించే ఈ సంస్థ.. బంగ్లాదేశ్‌లో మాత్రం రాడికల్ సంస్థ అయ్యిందా? మత ఛాందసవాద సంస్థ అయ్యిందా? మరి హిందూ దేవాలయాలే లక్ష్యంగా జరిగే దాడులు చేస్తున్నది ఎవరు? మత ఛాందసవాదులు కాదా? దీనికి బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులకు సమాధానం చెప్పే తీరాలి. ఐరోపా, అమెరికా దేశాల్లో వీధివీధిన వెలిసిన ఈ ఇస్కాన్.. బంగ్లాదేశ్‌లో మాత్రం మత సంస్థగా ముద్రపడిరది. కాదు కాదు.. అలా ముద్ర వేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఇస్కాన్ అధికారిక లెక్కల ప్రకారమే ఆ సంస్థ కార్యకలాపాలు 150 దేశాల్లో ఉన్నాయి. మరి ఆ 150 దేశాల్లో ఎక్కడా ఈ సంస్థపై మత సంస్థ ముద్ర పడలేదు. ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే ఉంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ చర్యలను ప్రపంచంలోని యావత్తు హిందూ సమాజం తీవ్రంగా తప్పుపడుతోంది. ఇక.. చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టుపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు అచ్చం పాకిస్థాన్‌లా కనిపిస్తున్నాయని కేంద్రంలోని అధికార పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులను మోదీ సర్కారు ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. చిన్మయ్ అరెస్టు పరిణామాలను తెలుసుకుంటోంది.
ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. బంగ్లాదేశ్‌లో భారత్‌పై వ్యతిరేకత పెంచే కుట్రలు జరుగుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ.. బంగ్లాదేశ్‌ను మరో పాకిస్థాన్‌లా మార్చేస్తున్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. ఆ దేశంలో నిత్యం ఏదో ఒక చోట హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ.. మహ్మద్ యూనస్ ప్రభుత్వంలో మళ్లీ రెచ్చిపోతోంది. ఈ ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ అండగా నిలుస్తోందన్న వాదనలూ ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో అరాచకాన్ని ప్రోత్సహించి.. మతం పేరిట మారణహోమానికి తెరలేపారు. మొత్తంగా ఆ దేశంలో మైనారిటీలపై వ్యతిరేకత పెరుగుతోంది. దీని వెనుక భారీ కుట్రే ఉందని స్పష్టంగా అవగతమవుతోంది. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని తొలగించి.. ఇస్లామిక్ షరియత్ పాలన సాగించాలన్న వ్యూహమేనని అర్థం అవుతోంది. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే.. బంగ్లాదేశ మరో ఉగ్రవాద దేశంగా మారటం ఖాయం. ఇది భారత్‌కు పక్కలో బళ్లెం మాదిరే.
పసిఫిక్ కూటమిలో బంగ్లాదేశ్‌ను భాగం చేసుకొని లబ్ధి పొందాలని అమెరికా బైడెన్ సర్కారు భావించింది. కానీ అందుకు హసీనా ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై కక్ష కట్టి అమెరికానే.. మహ్మద్ యూనస్‌ను ఎగదోసి ఈ అల్లర్లకు తెర లేపిందన్న వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి. అయితే.. యూనస్ ఆగడాలకు ట్రంప్ గెలుపు అడ్డు పడుతుందని అనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఓడిపోవాలని కోరుకున్న వ్యక్తుల్లో యూనస్ పేరు ప్రముఖంగా ఉంటుంది. ఈ విషయాన్ని ట్రంప్ కూడా బాహాటంగా తెలిపారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక.. తన పని పడతారని యూనస్‌కూ తెలుసు. ఆలోగా.. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని అరాచకం సృష్టించేందుకు యూనస్ పావులు కదుపుతున్నాడు. 1930ల్లో బంగ్లాదేశ్‌లో 30 శాతానికిపైగా ఉన్న హిందువులు.. ఇప్పుడు 8 శాతానికి పడిపోయారంటే అక్కడ ఏం జరగుతుందన్నది గణాంకాల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ అరాచకాన్ని భారత ప్రభుత్వం అడ్డుకొని హిందువుల రక్షణకు చర్యలు చేపట్టాలి.