తొమ్మిది నెలల నిరీక్షణకు తెర.. భూమిపైకి చేరిన సునీత విలియమ్స్

భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు భూమి మీదకు చేరుకున్నారు. 9 నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వచ్చారు. నాసా ప్రకారం వారి స్పేస్ సెక్స్ డ్రాగన్ అంతరిక్షం నౌక ఐఎస్టి మంగళవారం ఉదయం 10:35 గంటలకు ఐఎస్ఎస్ నుంచి అన్ డాక్ అయింది. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అయింది. భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడం అంతరిక్ష ప్రయాణంలో అత్యంత కీలకమైన దశల్లో ఒకటి. అంతరిక్ష నౌక వాతావరణంలోకి వచ్చినప్పుడు అది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. వీటిలో 7వేల డిగ్రీల ఫారన్హీట్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని నాసా వెల్లడించింది.

Sunita who came out of the space capsule

స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చిన సునీత విలియమ్స్

భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు భూమి మీదకు చేరుకున్నారు. 9 నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వచ్చారు. నాసా ప్రకారం వారి స్పేస్ సెక్స్ డ్రాగన్ అంతరిక్షం నౌక ఐఎస్టి మంగళవారం ఉదయం 10:35 గంటలకు ఐఎస్ఎస్ నుంచి అన్ డాక్ అయింది. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అయింది. భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడం అంతరిక్ష ప్రయాణంలో అత్యంత కీలకమైన దశల్లో ఒకటి. అంతరిక్ష నౌక వాతావరణంలోకి వచ్చినప్పుడు అది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. వీటిలో 7వేల డిగ్రీల ఫారన్హీట్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని నాసా వెల్లడించింది. ల్యాండింగ్ కు ముందు హైపర్ సోనిక్ వేగాన్ని కట్టుకునేలా అంతరిక్షం నౌకను రూపొందించాలి. వ్యోమగామిగా బయటకు చూస్తే అదో ఫైర్ వాల్ కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరిగి ప్రయాణం అయిన సునీత విలియమ్స్, విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. డ్రాగన్ వ్యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికి తీసాయి. ఆ తరువాత ఆస్ట్రోనాట్లను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్ నుంచి బయటికి తీసుకొచ్చారు.

ఊహించని సవాళ్లు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్ గా ముగియడంతో ఆనందం వెల్లి విరిసింది. 286 రోజుల తర్వాత సునీత విలియమ్స్, విల్మోర్ సురక్షితంగా భూమికి చేరినట్లు నాసా ప్రకటించింది. ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్ క్రూ -9 మిషన్ భూమి వాతావరణం లోకి తిరిగి ప్రవేశించిన క్షణాలను నాసా లైవ్ ప్రసారం చేసింది. భూమికి చేరిన వారిలో సునీత విలియమ్స్, విల్మోర్ తోపాటు స్పేస్ ఎక్స్ క్రూ -9 వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు. డ్రాగన్ వ్యోమ నౌక భూమికి చేరుకుని పారాచూట్లను ఓపెన్ చేసింది. తిరిగి ప్రవేశించిన తర్వాత వ్యోమనౌకను స్థిరీకరించడానికి రెండో డ్రోగ్ పారాచూట్లు, ల్యాండింగ్ కు ముందు వ్యామ నౌక వేగాన్ని మరింత తగ్గించడానికి నాలుగు ప్రధాన పారాచూట్లను డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్ కు అమర్చారు. ల్యాండింగ్ తరువాత వ్యోమగాములను హోస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు  తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తరువాత వారి శారీరిక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందించనున్నారు. సునీత విలియమ్స్ ఎట్టకేలకు భూమికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆమె రాక కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆశగా ఎదురు చూశారు. ఆమె క్షేమంగా భూమికి చేరుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. గుజరాత్లో టపాసులు కాల్చి సునీత బంధు వర్గం ఆనందాన్ని వ్యక్తం చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్