మూడు పార్టీల్లో విభేదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహారశైలి, చేస్తున్న కార్యక్రమాలు కూటమి పార్టీల్లో ఉన్న విభేదాలను బహిర్గగం చేసినట్టు చెబుతున్నారు. గడిచిన కొద్దిరోజులుగా పవన్ కల్యాణ్ ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే అనేక అనుమానాలకు తావిచ్చింది. తాజాగా నిర్వహించిన మంత్రిమండలి సమావేశానికి కూడా పవన్ దూరంగా ఉన్నారు. అయితే, పవన్ కల్యాణ్‌కు జ్వరం కావడం వల్లే ఆయన రాలేదంటూ చెప్పుకువచ్చారు. అయితే, ఇప్పుడు పవన్ కల్యాణ్ హఠాత్తుగా సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు కూడా ఆయన తెలియజేయలేదు. ఇప్పుడు ఇప్పుడు అగ్గి రాజేస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో వైసీపీని అధికారానికి దూరం చేసేందుకు గడిచిన ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగి అఖండ విజయాన్ని నమోదు చేశాయి. 164 స్థానాల్లో కూటమి పార్టీలు విజయాన్ని సాధించాయి. అధికారంలోకి వచ్చి ప్రస్తుతం ఎనిమిది నెలలు గడిచింది. అయితే, అప్పుడే ఈ మూడు పార్టీల్లో విభేదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహారశైలి, చేస్తున్న కార్యక్రమాలు కూటమి పార్టీల్లో ఉన్న విభేదాలను బహిర్గగం చేసినట్టు చెబుతున్నారు. గడిచిన కొద్దిరోజులుగా పవన్ కల్యాణ్ ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే అనేక అనుమానాలకు తావిచ్చింది. తాజాగా నిర్వహించిన మంత్రిమండలి సమావేశానికి కూడా పవన్ దూరంగా ఉన్నారు. అయితే, పవన్ కల్యాణ్‌కు జ్వరం కావడం వల్లే ఆయన రాలేదంటూ చెప్పుకువచ్చారు. అయితే, ఇప్పుడు పవన్ కల్యాణ్ హఠాత్తుగా సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు కూడా ఆయన తెలియజేయలేదు. ఇప్పుడు ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. మంగళశారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశానికి, ఈ నెల ఆరో తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశానికి రాని పవన్ కల్యాణ్.. ఇప్పుడు హఠాత్తుగా తీర్థయాత్రలకు వెళ్లడం, అది కూడా ప్రభుత్వ పెద్దలకు కనీస సమాచారాన్ని ఇవ్వకపోవడం అంతర్గత లుకలుకలకు అద్ధం పడుతోందని చెబుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో తీర్థయాత్రలకు పవన్ వెళ్లడం చూస్తుంటే వ్యక్తిగత అజెండా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గడిచిన కొన్నాళ్లుగా హిందూ భావజాలంతో పవన్ కల్యాణ్ ముందుకు వెళుతున్నారు. ఇదే స్టాండ్ తీసుకోవడం ద్వారా రానున్న రోజుల్లో పూర్తిస్థాయి రాజకీయాలను కొనసాగించేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఈ యాత్రకు ఆయన సిద్ధమైనట్టు చెబుతున్నారు. మూడు రోజులపాటు ఈ యాత్రలో భాగంగా ఆయన దక్షిణాది రాష్ట్రాల్లోని అనేక దేవాలయాలను సందర్శించనున్నారు. ఈ పరిస్థితికి టీడీపీయే కారణం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గడిచిన కొన్నాళ్లుగా మంత్రి నారా లోకేష్‌కు చెందిన టీమ్ పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నాయి. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకురావడం టీడీపీ రాజకీయ వ్యూహంలో భాగమేనన్న భావనకు పవన్ కల్యాణ్ వచ్చారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తరువాత పవన్ తన అసంతృప్తిని తెలియజేసేందుకు ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. అయితే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నడుం బిగిస్తారా..? లేక దీన్ని మరింత తెగే వరకు లాగుతారా..? అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా పవన్ కల్యాణ్ తీర్థయాత్రలకు వెళ్లడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అలజడి రేగించింది.