ఈ నెల ఐదు నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. 25 న ముగింపు.!

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు ఈనెల 5వ తేదీన పరీక్షలు ప్రారంభమై 24న ముగియనున్నాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల ఆరో తేదీన పరీక్షలు ప్రారంభమై 25 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఇంటర్ పరీక్షలకు ఏడాది సుమారు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు ఈనెల 5వ తేదీన పరీక్షలు ప్రారంభమై 24న ముగియనున్నాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల ఆరో తేదీన పరీక్షలు ప్రారంభమై 25 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఇంటర్ పరీక్షలకు ఏడాది సుమారు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు చెబుతున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అనుగుణంగా ఆన్లైన్లో వీటిని అందుబాటులో ఉంచారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటులో పూర్తి చేసింది. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలు కూడా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయకూడదని ఆదేశాలను జారీ చేసింది. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు. 

విద్యార్థులు ఆందోళన వద్దు 

ఇంటర్ పరీక్షలు రాసే ఎంతోమంది విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు మంచి మార్కులు సాధించాలన్న ఒత్తిడికి గురై తీవ్ర ఆందోళన పడుతుంటారు. కొంతమంది పిల్లలు చదువుకునే సమయంలో ఆందోళన, మానసిక సమస్యల వంటివి ఎదుర్కొంటుంటారు. వి నేపథ్యంలో వారికి కుటుంబ సభ్యుల అండగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు స్వేచ్ఛను ఇచ్చి ప్రశాంతంగా పరీక్షలు రాసేలా తల్లిదండ్రులు భరోసా కల్పించాలని సూచిస్తున్నారు. అప్పుడే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు. పరీక్షల్లో మంచి మార్పులు తెచ్చుకోవాలన్న ఒత్తిడి పిల్లలు అధికంగా ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఈ మేరకు భరోసా కల్పిస్తే వారు మంచి గా పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు భరోసా కల్పించినట్లు అయితే విద్యార్థుల్లో ఆందోళన భయం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది పిల్లల్లో డిప్రెషన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశాన్ని కలిగిస్తుందని సూచిస్తున్నారు. పరీక్షల పూర్తయ్యేంతవరకు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని.. పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలని సూచిస్తున్నారు. పరీక్షలు రాయలేదన్న ఒత్తిడితో కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్