ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1535 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
విద్యార్థులు
ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1535 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10.58 మంది లక్షల విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారులు కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్ గా ప్రకటించారు. అధికారిక సమాచారం కోసం చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రమే ఇంటర్ బోర్డు ఒక కీప్యాడ్ ఫోను సమకూర్చారు. ఈ పరీక్షలకు నిమిషం నిబంధనను అమలు చేస్తున్నారు. అంటే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించరు. ఇప్పటికే విద్యార్థులు కూడా పరీక్షల కోసం సన్నద్ధమయ్యారు. తల్లిదండ్రులు విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేశారు.
ఆందోళన వద్దు..
పదో తరగతి పరీక్షలో ప్రారంభమవుతున్న వేళ నిపుణులు విద్యార్థులకు కీలక సూచనలు చేస్తున్నారు. విద్యార్థులు ఎవరు ఆందోళన చెందవద్దని నిపుణులు పేర్కొంటున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకొని పరీక్షలు రాయాలని సూచిస్తున్నారు. ఒకవేళ పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరు అఘాయిత్యాలకు పాల్పడకూడదని పేర్కొంటున్నారు. పరీక్షలు, మార్కులే జీవితం కాదని, జీవితంలో అనేక విషయాలకు ప్రాధాన్యత ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను మార్కుల కోసం, ర్యాంకుల కోసం ఒత్తిడి చేయవద్దని నిపుణులు పేర్కొంటున్నారు.