అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన ఎడిట్స్‌ యాప్‌..లాంచ్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా భిన్నమైన యాప్‌లు, ఫీచర్లు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మెటా కంపెనీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా మరో కొత్త యాప్‌ను లాంచ్‌ చేసింది. రెండు రోజులు కిందట లాంచ్‌ అయిన ఈ యాప్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎడిట్స్‌ పేరు ఈ కొత్త స్టాండ్‌ అలోన్‌ యాప్‌ను అధికారికంగా మెటా విడుదల చేసింది. వీడియోలు క్రియేషన్‌ను సులభతరం చేయడమే ఈ యాప్‌ ఉద్ధేశం. ఇప్పటికే ఏడాది ప్రారంభంలో ఈ యాప్‌ను ప్రివ్యూ చేశారు. ఇక ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకారం వీడియోలు తయారు చేయడం చాలా మందికి ప్రస్తుతం కష్టంగా మారుతోంది.

Edits App

ఎడిట్స్‌ యాప్‌

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా భిన్నమైన యాప్‌లు, ఫీచర్లు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మెటా కంపెనీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా మరో కొత్త యాప్‌ను లాంచ్‌ చేసింది. రెండు రోజులు కిందట లాంచ్‌ అయిన ఈ యాప్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎడిట్స్‌ పేరు ఈ కొత్త స్టాండ్‌ అలోన్‌ యాప్‌ను అధికారికంగా మెటా విడుదల చేసింది. వీడియోలు క్రియేషన్‌ను సులభతరం చేయడమే ఈ యాప్‌ ఉద్ధేశం. ఇప్పటికే ఏడాది ప్రారంభంలో ఈ యాప్‌ను ప్రివ్యూ చేశారు. ఇక ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకారం వీడియోలు తయారు చేయడం చాలా మందికి ప్రస్తుతం కష్టంగా మారుతోంది. అనేక యాప్‌లు, క్లిష్టమైన వర్క్‌ ఫ్లోలు ఉండడం వల్ల క్రియేటర్లకు ఇది తలనొప్పిగా మారుతోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో వీడియోలు తయారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఎడిట్స్‌ యాప్‌ను అందబాటులోకి తీసుకువచ్చారు.

ఇందులో ఉన్న అనేక ఉపయోగకరమైన టూల్స్‌ సహాయంతో వీడియో సృష్టి మరింత సులభతరం అవుతుంది. ఇక ఈ యాప్‌లో ప్రధానమైన ఫీచర్ల విషయానికి వస్తే వీడియో రికార్డింగ్‌, డైరక్ట్‌ షేరింగ్‌ / ఎక్స్‌ పోర్ట్‌, 4కే ఎక్స్‌పోర్ట్‌ సపోర్ట్‌, డ్రాప్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్రేమ్‌ లెవల్‌ ఎడిటింగ్‌, అడ్వాన్స్‌ కెమెరా కంట్రోల్స్‌, ఏఐ ఆధారిత ఫీచర్లు, క్రియేటివ్‌ అసెట్స్‌, ఆడియో ఎన్‌హాన్స్‌ మెంట్స్‌, ఆటో క్యాప్షన్స్‌, రియల్‌ టైమ్‌ ఇన్‌సైట్స్‌, ఆటో క్యాప్షన్స్‌, రియల్‌ టైమ్‌ ఇన్‌సైట్స్‌, కంటెంట్‌ ట్రాకింగ్‌ లాంటి అద్భుతమై ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకారం యూజర్‌ ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఈ యాప్‌ నిరంతరం అప్డేట్‌ అవుతుంది. రాబోయే రోజుల్లో కొన్ని ప్రధాన ఫీచర్లు చేర్చనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కీ ఫ్రేమ్స్‌, ఏఐ స్టైల్‌ మాడిఫికేషన్‌, కో-క్రియేషన్‌, క్రియేటివ్‌ టూల్స్‌ వంటి వాటిని అందించనున్నారు. ఎఇడట్‌ యాప్‌ ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో డౌన్‌లోడ్‌కు సిద్ధంగా ఉంది. యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో లాగి అయి యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. మరి మీరూ ట్రై చేయండి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్