కంటి నిండా నిద్ర పోలేక భారతీయులు వేలాదిమంది ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని సగం మంది ప్రజలకు కంటి నిండా నిద్ర కరువు అవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు ఒక అధ్యయన సంస్థ వెల్లడించింది. ఘాడంగా నిద్ర పడితే చాలు అనేక రోగాలు దరి చేరవు. రోజుకు కనీసం 8 గంటల పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిద్ర ఉండాలని చాలామంది ఆశిస్తారు. అయితే దేశంలోని 59 శాతం మందికి ఆ అదృష్టం దక్కడం లేదు. అంతరాయాలు లేని ఆరు గంటల నిద్ర వారికి కరువు అవుతోంది. ఈనెల 14న జరిపే ప్రపంచ నిద్ర దినోత్సవ సందర్భంగా లోకల్ సర్కిల్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెళ్లడైంది. సర్వేలో భాగంగా 343 జిల్లాల్లోని 40 వేలమంది అభిప్రాయాలను సేకరించారు.
ప్రతీకాత్మక చిత్రం
కంటి నిండా నిద్ర పోలేక భారతీయులు వేలాదిమంది ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని సగం మంది ప్రజలకు కంటి నిండా నిద్ర కరువు అవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు ఒక అధ్యయన సంస్థ వెల్లడించింది. ఘాడంగా నిద్ర పడితే చాలు అనేక రోగాలు దరి చేరవు. రోజుకు కనీసం 8 గంటల పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిద్ర ఉండాలని చాలామంది ఆశిస్తారు. అయితే దేశంలోని 59 శాతం మందికి ఆ అదృష్టం దక్కడం లేదు. అంతరాయాలు లేని ఆరు గంటల నిద్ర వారికి కరువు అవుతోంది. ఈనెల 14న జరిపే ప్రపంచ నిద్ర దినోత్సవ సందర్భంగా లోకల్ సర్కిల్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెళ్లడైంది. సర్వేలో భాగంగా 343 జిల్లాల్లోని 40 వేలమంది అభిప్రాయాలను సేకరించారు. వీరిలో 61 శాతం మంది పురుషులు, 59 శాతం మంది మహిళలు ఉన్నారు. సర్వే ప్రకారం 39 శాతం మంది 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోతున్నారు. మరో 39 శాతం మంది నాలుగు నుంచి ఆరు గంటల పాటు నిద్రపోతున్నారు. కేవలం రెండు శాతం మంది మాత్రమే ఎనిమిది నుంచి పది గంటల పాటు నిద్రపోతున్నట్లు వెల్లడించారు. మరో 20 శాతం మంది నాలుగు గంటలకన్నా తక్కువ సమయమే పడుకుంటున్నారు. మొత్తంగా 59 శాతం మందికి ఆటంకాలు లేని ఆరు గంటల నిద్ర కరువవుతోందని ఈ అధ్యాయం తేల్చింది. ఆలస్యంగా నిద్రపోవడం, త్వరగా నిద్ర లేవాల్సిన రావడం వంటి కారణాలవల్ల నిద్ర తక్కువ అవుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది.
దేశంలోని సగం మందికి పైగా ప్రజలకు కంటి నిండా కునుకు కరువు కావడానికి అనేక అంశాలు కారణమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దోమల బెడద అధికంగా ఉండడం, గంటల తరబడి సెల్ ఫోన్లు వినియోగించడం, బయట శబ్దాలు ఎక్కువగా ఉండడం, చిన్నపిల్లల అల్లరి వంటి కారణాలు నిద్ర తక్కువ కావడానికి దాహదం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కారణాలవల్ల ఎంతోమంది సరైన నిద్ర పట్టక ఇబ్బందులు పడుతున్నట్లు ఈ అధ్యాయం వెల్లడించింది. అయితే సరైన నిద్రలేమి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో నిద్రలేమి సమస్య అధికంగా ఉన్నట్లు అధ్యయనం నిర్వహించిన సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొంటున్నారు. కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉండలేకపోవడం, కనీసం పనిచేసేందుకు ఉత్సాహం ప్రదర్శించలేకపోవడం, రోజంతా డల్ గా ఉండడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నిద్రలేమి ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.