Indian Railways | ఇక నుంచి రైళ్లలో ఆ పనులు చేస్తే ఊచలు లెక్క బెట్టాల్సిందే

సోషల్ మీడియాలో రీల్స్ మోజులో పడి చాలామంది పరిమితులను దాటుతున్నారు. దీంతో ఇకపై దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్ల దగ్గర నిలబడి రీల్స్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భారతీయ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

railway rules

ప్రతీకాత్మక చిత్రం 

ఇప్పుడు ఉన్న కాలంలో చిన్న పిల్లలు, యువత, పెద్దవాళ్లు అని తేడా లేకుండా అంతా స్మార్ట్ ఫోన్‌నే వాడుతున్నారు. పైగా సోషల్ మీడియా మోజు బాగా పెరిగిపోయింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా రీల్స్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామన్‌గా మారింది. ఇంతకుముందు టిక్‌టాక్ యాప్‌లో రీల్స్ చేసేవారు. కానీ భారత ప్రభుత్వం ఆ యాప్‌ని రద్దు చేసింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ సంస్థలు రీల్స్ చేసే ఆప్సన్‌ని తీసుకువచ్చింది. అయితే ప్రజలు తమ మొబైల్‌లో రైల్వే ట్రాక్‌లపై, కదులుతున్న రైళ్లలో విస్యాసాల వీడియోలను చేస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ మోజులో పడి పరిమితులను దాటుతున్నారు. దీంతో ఇకపై దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్ల దగ్గర నిలబడి రీల్స్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భారతీయ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రైళ్ల కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తే, రైల్వే ప్రాంగణంలో కోచ్‌లు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు కేసులు నమోదు చేయాలని అన్ని జోన్‌ల అధికారులను ఆదేశించింది. రైలు పట్టాలపై వస్తువులను ఉంచడం లేదా నడుస్తున్న రైలులో వాహనాలను నడపడం ద్వారా ప్రాణాంతక విన్యాసాలు చేయడం ద్వారా తమ ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా వందల మంది ప్రయాణికుల భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ప్రజలు సెల్ఫీలు తీసుకుంటూ రైలుకు చాలా దగ్గరగా వచ్చి ట్రాక్‌కి దగ్గరగా వెళ్లినట్లు కనిపించిందని, రైలు తక్కువ సమయంలో ఎంత దూరం ప్రయాణించగలదో అర్థం చేసుకోలేదని అధికారి తెలిపారు. కొన్ని సందర్భాల్లో రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్