జింబాబ్వేతో నాలుగో టీ20లో భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ కైవశం

జింబాబ్వేతో నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యాన్ని మరో 28 బంతులు మిగిలి ఉండగానే పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు 3-1 తేడాతో సిరీస్‌ను కైవశం చేసుకుంది. చివరి టీ20 హరారే వేదికగా ఆదివారం జరగనుంది. శనివారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే జట్టు ఏడు వికెట్లు నష్టానికి 152 పరుగులు చేసింది.

Subman Gill and Yashaswi Jaiswal

సుబ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్ జోడీ

జింబాబ్వేతో నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యాన్ని మరో 28 బంతులు మిగిలి ఉండగానే పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు 3-1 తేడాతో సిరీస్‌ను కైవశం చేసుకుంది. చివరి టీ20 హరారే వేదికగా ఆదివారం జరగనుంది. శనివారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే జట్టు ఏడు వికెట్లు నష్టానికి 152 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో మద్వీరీ 25(24), టి మరుమని 32(31), కెప్టెన్‌ సికిందర్‌ రజా 46(28) మాత్రమే రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే జట్టు ఏడు వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ రెండు, తుషార్‌ దేశ్‌ పాండే, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ శర్మ, శివం దుబే ఒక్కో వికెట్‌ పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఓపెన్లు తొలి ఓవర్‌ నుంచే ధాటిగా ఆడుతూ బ్యాటింగ్‌ చేసి లక్ష్యాన్ని చేధించారు. 

మరో 28 బంతులు ఉండగానే మ్యాచ్‌ను ముగించారు. పది వికెట్ల తేడాతో భారత్‌ జట్టు నాలుగో టీ20 మ్యాచ్‌ను కైవశం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఓపెన్లు యశస్వి జైస్వాల్‌ 53 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 93 పరుగలు చేయగా, సుబ్‌ మన్‌ గిల్‌ 39 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సులు సహాయంతో 58 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి ఓవర్‌ నుంచి ధాటిగా ఆడడంతో జింబాబ్వే బౌలర్లు ధారాలంగా పరుగులు సమర్పించుకున్నారు. భారత్‌ బ్యాటర్లను ఏ స్థాయిలోనూ జింబాబ్వే బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా యశస్వి జైస్వాల్‌ ఎంపికయ్యాడు. చివరి టీ20 ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం) హరారేలో ప్రారంభం కానుంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్