ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి రెండో టెస్ట్ ఆడనుంది. ఈ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ లో ఘన విజయం సాధించిన భారత జట్టు రెండో టెస్ట్ లోను విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఫ్లడ్ లైట్ వెలుతురులో రెండో టెస్ట్ గులాబీ బంతితో జరగనుంది. ఈ బంతితో పరుగులు సాధించడం బ్యాటర్లకు అంత సులభం కాదు. పైగా గతంలో భారత జట్టుకు ఇక్కడ ఓడిన అనుభవం కూడా ఉండడంతో ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి రెండో టెస్ట్ ఆడనుంది. ఈ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ లో ఘన విజయం సాధించిన భారత జట్టు రెండో టెస్ట్ లోను విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఫ్లడ్ లైట్ వెలుతురులో రెండో టెస్ట్ గులాబీ బంతితో జరగనుంది. ఈ బంతితో పరుగులు సాధించడం బ్యాటర్లకు అంత సులభం కాదు. పైగా గతంలో భారత జట్టుకు ఇక్కడ ఓడిన అనుభవం కూడా ఉండడంతో ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. తొలి టెస్ట్ విజయం అందించిన ఆత్మవిశ్వాసంతో భారత జట్టు బరిలోకి దిగుతుండగా, తొలి టెస్ట్ పరాభవం నుంచి కోలుకొని కసి తీర్చుకోవాలని ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగుతోంది. నాలుగేళ్ల క్రితం ఆడిలైట్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు కేవలం 36 పరుగులకే ఆల్ అవుట్ అయింది. టెస్ట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు ఇదే చెత్త రికార్డు. ఎనిమిది వికెట్ల తేడాతో ఆ టెస్ట్ ఓడిన భారత జట్టుకు బదులు తీర్చుకునే అవకాశం వచ్చింది. రెండో టెస్టు జరగనున్న పేతురు శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశం 51 శాతం ఉంది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టణం ఉండడంతో మ్యాచ్ కు అంతరాయం కలుగకపోవచ్చు. ఆడిలైడ్ పిచ్ బ్యాట్ కు, బంతికి సమతూకంగా ఉండనుంది. ఆరంభంలో పేసర్లు లాభపడతారు. రాత్రిపూట బంతితో అదనపు స్వింగ్ రాబట్టవచ్చు. మ్యాచ్ సాగే కొద్ది బ్యాటర్లకు అనుకూలిస్తుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకే మ్యాచ్ ప్రారంభం కానుంది.
బలంగా భారత బ్యాటింగ్ విభాగం..
భారత బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. తొలి టెస్ట్ కు దూరంగా ఉన్న గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్ట్ నుంచి జట్టులో చేరనున్నారు. దీంతో భారత జట్టు రెండో టెస్టులో పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. అంతా ఊహించినట్టుగానే ఈ మ్యాచ్ లోను ఓపెనర్ గా రాహుల్ బరిలోకి దిగనున్నాడు. సరైన కాంబినేషన్ తో ఆడేందుకు రోహిత్ తన స్థానాన్ని త్యాగం చేశాడు. ఫామ్ లో ఉన్న రాహుల్ను తప్పించడం అనవసరమంటూ, తను ఐదో స్థానంలో రానున్నాడు. తమకు విజయం మాత్రమే ముఖ్యమని, పెర్తులో ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్ అద్భుతంగా రాణించారని రోహిత్ కితాబ్ ఇచ్చాడు అందుకే వారి స్థానాలను మార్చాల్సిన అవసరం లేదని తేల్చాడు.
తీవ్ర ఒత్తిడిలో ఆస్ట్రేలియా జట్టు..
ఆస్ట్రేలియా జట్టు గతంలో ఎన్నడు లేనివిధంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. తొలి టెస్టులో దారుణమైన పరాభవం తరువాత ఆస్ట్రేలియా జట్టుపై ఒత్తిడి పెరిగింది. రెండో టెస్టులో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఆ జట్టుకు ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడితో రెండో టెస్టులో కసితో బరిలోకి దిగనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియా జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదని క్రికెట్ విశ్లేషకులు భారత జట్టుకు సూచిస్తున్నారు. పెర్త్ టెస్టులో మెరుగ్గా రాణించిన పేసర్ హాజల్ వుడ్ ఈ టెస్ట్ కు దూరం కావడం ఆస్ట్రేలియా జట్టుకు దెబ్బగానే చెప్పాలి. 2020లో భారత జట్టు 36 పరుగులకే కుప్ప కూలడంలో అతడి పాత్ర కీలకమైనది. ఈ స్థానంలో 18 నెలల తరువాత బోలాండ్ మరో టెస్ట్ ఆడబోతున్నాడు. మరోవైపు బ్యాటర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత స్టార్ బౌలర్ బుమ్రా విసురుతున్న బంతులను ఎదుర్కోవడంలో ఆసీస్ బ్యాటర్లు తేలిపోతున్నారు. టెస్టు స్పెషలిస్టులు స్మిత్, లబుషెన్ ప్రభావం చూపించలేకపోతున్నారు. ఓపెనర్ మాక్ స్వీన్ అరంగేట్రంలో ఆకట్టుకోలేకపోయాడు.
ఇవి జట్లు అంచనా
భారత జట్టు : జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లీ, రోహిత్ (కెప్టెన్), పంత్, సుందర్, నితీష్ కుమార్, హర్శిత్ రాణా, బుమ్రా, సిరాజ్
ఆస్ట్రేలియా జట్టు
మెక్ స్వేన్, కవాజా, లబుషెన్, స్మిత్, హెడ్, మిచెల్ మార్ష్, క్యారీ, కమిన్స్, స్టార్క్, లియోన్, బొలాండ్