బోర్డర్గ - భాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు దారుణ ఓటమిని చవిచూసింది. తొలి టెస్ట్ ఓటమికి ఆస్ట్రేలియా జట్టు ప్రతీకారాన్ని తీర్చుకుంది. పది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సిరీస్ లో ఇరుజట్లు 1-1 సమానంగా నిలిచాయి. గులాబీ బంతితో జరిగిన డే నైట్ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 44.1 ఓవర్లకు 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఆనందంలో ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు
బోర్డర్గ - భాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు దారుణ ఓటమిని చవిచూసింది. తొలి టెస్ట్ ఓటమికి ఆస్ట్రేలియా జట్టు ప్రతీకారాన్ని తీర్చుకుంది. పది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సిరీస్ లో ఇరుజట్లు 1-1 సమానంగా నిలిచాయి. గులాబీ బంతితో జరిగిన డే నైట్ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 44.1 ఓవర్లకు 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బాటర్లలో రాహుల్ (37), సుబ్ మన్ గిల్ (31), పంత్ (21), నితీష్ రెడ్డి (42), అశ్విన్ (22) పరుగులు చేయడంతో భారత జట్టు నామమాత్రపు స్కోర్ కు పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. కెప్టెన్ కమిన్స్, బోలాండ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 337 పరుగులు చేసింది. దీంతో 157 పరుగుల ఆదిక్యాన్ని ఆస్ట్రేలియా జట్టు దక్కించుకుంది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో మెక్ స్వేనీ (39), లబు సెన్ (64) పరుగులు చేయగా, హెడ్ 140 పరుగుల భారీ శతకంతో ఆస్ట్రేలియా జట్టు మెరుగైన స్కోర్ సాధించేలా చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ నాలుగేసి వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు తొలి నుంచి మాదిరిగానే బ్యాటర్లు విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్ లో 36.5 ఓవర్లలోనే భారత బ్యాటర్లు 175 పరుగులకు పెవిలియన్ బాట పట్టారు. యశస్వి జైస్వాల్ (24), సుబ్ మన్ గిల్ (28), పంత్ (28) పరుగులు మాత్రమే చేయడంతో భారత జట్టు స్వల్ప స్కోరుకే ఆల్ అవుట్ అయింది. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్ పెద్దగా స్కోర్లు చేయకపోవడంతో ఈ టెస్టులో భారత జట్టుకు పరాభవం తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ కమిన్స్ ఐదు వికెట్లు పడగొట్టగా, బోలాన్డ్ మూడు, స్టార్కు రెండు వికెట్లు పడగొట్టాడు. స్వల్ప స్కోర్ ను చేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 3.2 ఓవర్లలో 19 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాన్ అఫ్ ద మ్యాచ్ గా ట్రావెస్ హెడ్ నిలిచాడు. ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది రెండు టెస్టుల్లో ఒక్కో మ్యాచ్లో విజయం సాధించి సమవుజ్జీలుగా రెండు జట్లు నిలిచాయి. మరో మూడు టెస్టులు ఆడాల్సి ఉంది.