బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పై ఒత్తిడి పెట్ట వద్దంటూ అగ్రరాజ్యం అమెరికాను భారత్ కొన్నాళ్ల కిందట కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కీలక కథనాన్ని తాజాగా ప్రచురించింది. బంగ్లాదేశ్ లో తాజాగా నెలకోన పరిస్థితులు, ఆమె ప్రస్తుతం భారత్ లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రచురించిన కథనం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ప్రధాని మోదీ, షేక్ హసీనా (పాత చిత్రం)
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పై ఒత్తిడి పెట్ట వద్దంటూ అగ్రరాజ్యం అమెరికాను భారత్ కొన్నాళ్ల కిందట కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కీలక కథనాన్ని తాజాగా ప్రచురించింది. బంగ్లాదేశ్ లో తాజాగా నెలకోన పరిస్థితులు, ఆమె ప్రస్తుతం భారత్ లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రచురించిన కథనం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కథనానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏడాది కిందట భారత్ బంగ్లాదేశ్ ప్రధాని విషయంలో అమెరికాకు కీలక విజ్ఞప్తిని చేసింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను అధిక ఒత్తిడికి గురి చేయవద్దు అంటూ భారత అధికారులు అమెరికాను కోరినట్టు కథనంలో వెల్లడించింది. 2024 జాతీయ ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్ పలువురరిని జైల్లో వేయడానికి ఉద్దేశించి అమెరికా దౌత్యవేత్తలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అదే సమయంలో అమెరికా ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ కు చెందిన ఒక పోలీసు విభాగంపై ఆంక్షలు విధించింది. ఇది అవామీ అధినేత కింద పనిచేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థ బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం అణిచివేతకు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడే వారిపైన ఆంక్షలు విధిస్తామని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే భారత అధికారులు వరుసగా అమెరికాతో చర్చలు జరిపారు.
హసీనా విషయంలో మరీ కఠినమైన వైఖరి అవలంబించవద్దు అంటూ అమెరికాను కోరిన విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అక్కడ ప్రతిపక్షాలు బలపడితే ఆ దేశం ఇస్లామిక్ అతివాద శక్తులకు కేంద్రంగా మారుతుందని న్యూఢిల్లీ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ పత్రిక కథనం వెల్లడించింది. అంతిమంగా ఇది భారత్ జాతీయ భద్రతకు సవాల్ విసురుతుందని అమెరికా స్పష్టం చేసింది. వ్యూహాత్మక ఏకాభిప్రాయం లేకపోతే వ్యూహాత్మక భాగస్వామి కూడా కాలేరని భారత అధికారి పేర్కొన్నట్లు వెల్లడించింది. ఆ తరువాత నుంచి బైడెన్ కార్యవర్గం నాటి బంగ్లా ప్రధాని హసీనా, ఆమె అధికారులపై ఆంక్షలు విషయంలో కొంత మెతక వైఖరిని అవలంభించినట్లు తెలిసిందని పత్రిక ప్రచురించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితి దారి తప్పిందా..? అనే విషయంపై భారత, అమెరికా విశ్లేషించుకున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. కొన్ని విషయాల్లో అమెరికా ప్రజల అంచనాలకు భిన్నంగా ఉన్న భాగస్వాములతో కలిసి పని చేయాల్సి ఉంటుందని ఓ అమెరికా అధికారి వ్యాఖ్యానిచ్చినట్లు పత్రిక కథనంలో వెల్లడించింది. బంగ్లాదేశ్ లో క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో ఎన్నికలకు ముందే హసీనా విషయంలో కఠిన వైఖరిని అవలంబించాలని అక్కడి అమెరికా రాయబారి పీటర్హాస్ వంటి వారు కోరారు. ఈ నేపథ్యంలోనే అమెరికా బంగ్లాదేశ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ ఎన్నికలు జరగా దీనిని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బహిష్కరించింది. ఆ తర్వాత ఈ ఎన్నికలను సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. అమెరికా విదేశాంగ శాఖ మాత్రం బంగ్లాదేశ్ లో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగలేదని ఆరోపించింది. ఈ ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీయగా, బంగ్లాలో ప్రభుత్వాన్ని అనేక వర్గాల నుంచి ప్రశ్నలు ఎదుర్కొనేలా చేసింది. అమెరికా ఆరోపణలు, ఎన్నికల అనంతరం కొన్ని నెలలు మౌనంగా ఉన్న హసీనా కొద్ది నెలలు కిందట సంచలన ప్రకటన చేశారు. బాంగ్లాదేశ్ లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేటట్టు చూస్తానని ఆఫర్ ఇచ్చిన విషయాన్ని ఆమె బహిర్గతం చేశారు. ఆ దేశం అమెరికా అంటూ పెద్ద ఎత్తున ప్రచారము జరిగింది. తాజాగా వాషింగ్టన్ పోస్టు పత్రిక ప్రచురించిన కథనం కూడా బంగ్లాదేశ్ ప్రధాని హసీనా చెప్పిన విషయాన్ని బలోపేతం చేస్తున్నట్లు కనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. మరి ఈ కథనంపై అమెరికా గాని, భారత్ గాని, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గాని ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.