ఇంగ్లీష్ భాష మాట్లాడే దేశాల్లో భారత టాప్.. పియర్షన్ నివేదికలో వెల్లడి

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయుల నైపుణ్యాలు అధికంగా ఉండడంతో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. భారతీయులకు ఉన్న నైపుణ్యాల్లో ఇంగ్లీష్ ఒకటిగా చెబుతారు. ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడటం వల్లే మంచి అవకాశాలను భారతీయులు దక్కించుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఒక అధ్యయనం వెల్లడించింది. ఇంగ్లీష్ భాష మాట్లాడటంలో ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్లో ఆంగ్లభాష వినియోగం అధికంగా ఉందని పియర్సన్ నివేదికలో వెల్లడయింది.

Iconic image

ప్రతికాత్మక చిత్రం

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయుల నైపుణ్యాలు అధికంగా ఉండడంతో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. భారతీయులకు ఉన్న నైపుణ్యాల్లో ఇంగ్లీష్ ఒకటిగా చెబుతారు. ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడటం వల్లే మంచి అవకాశాలను భారతీయులు దక్కించుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఒక అధ్యయనం వెల్లడించింది. ఇంగ్లీష్ భాష మాట్లాడటంలో ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్లో ఆంగ్లభాష వినియోగం అధికంగా ఉందని పియర్సన్ నివేదికలో వెల్లడయింది. ఇంగ్లీష్ భాష మాట్లాడటంలో ప్రపంచ దేశాలు చూపుతున్న ప్రావీణ్యంపై పియర్సన్ సంస్థ రూపొందించిన 'గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ - 2024' నివేదికలో ఇలాంటి పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. భారత్, ఫిలిప్పీన్స్, జపాన్, ఈజిప్ట్, కొలంబియా, యూరప్ వంటి దేశాల్లో ఇంగ్లీష్ భాష మాట్లాడగల సామర్థ్యంపై నివేదికలో ఎక్కువ వివరాలు ఉన్నాయి. వేరువేరు దేశాల్లో దాదాపు 7,50,000 మందిలో ఆంగ్ల భాష పై పట్టు, పాండిత్యాన్ని అధ్యయనకారులు పరీక్షించారు. ఈ మేరకు ఇంగ్లీష్ భాష నైపుణ్యాన్ని అంచనా వేసే వెర్షాంట్ టెస్ట్ చేశారు. ఇందులో ఇంగ్లీష్ భాషా నైపుణ్యం విషయంలో ప్రపంచ వ్యాప్త సగటు 57 స్కోర్ కాగా భారతదేశంలో ఇది 52 గా నమోదయింది.

దేశాల వారీగా చూస్తే ఇంగ్లీషులో మాట్లాడే సంఖ్య పరంగా చూస్తే ప్రపంచ సగటు 54 స్కోర్ తో పోలిస్తే భారత స్కోరు ఏకంగా 57 ఉండటం విశేషం. ఇంగ్లీషులో రాయగల సామర్థ్యానికి సంబంధించి ప్రపంచ వ్యాప్త సగటు స్కోరు అరవై ఒకటి కాగా భారత్ స్కోర్ కూడా 61 గా నమోదయింది. ఇక ఇంగ్లీషులో మాట్లాడే వారికి సంబంధించి రాష్ట్రాలువారీగా పరిశీలిస్తే 63 స్కోర్ తో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. 60 స్కోర్ తో రాజస్థాన్ రెండో స్థానంలో, 58 స్కోర్ తో పంజాబ్ మూడో స్థానంలో నిలిచింది. డిజిటల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అంతర్జాతీయ వ్యాపార సత్సంబంధాల పెంపునుకు దోహదపడేలా ఇంగ్లీషులో రాయగలిగేలా సిబ్బందిని నియమించుకుంటున్నారు. ఆర్థిక, బ్యాంకింగ్ రంగంలో ప్రపంచ సగటు 56 కోరును మించి భారత్ స్కోరు 63 ఉండడం ఎందుకు నిదర్శనం అని పియర్సన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ డివిజన్ అధ్యక్షుడు గోవని గోవానెల్లి పేర్కొన్నారు. భారత్లో ఇంగ్లీష్ నైపుణ్యానికి సంబంధించి మార్కెట్ పెరిగిందని, భవిష్యత్తులో ఇది మరింత విస్తరించనుందని ఆయన చెప్పారు. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో స్కోర్ మరియు తక్కువగా 45 వద్దే ఆగిపోయిందని, టెక్నాలజీ, కన్సల్టింగ్, బిపిఓ సేవలకు సంబంధించి స్కోరు మెరుగ్గా ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్