బిలియనీర్లకు అడ్డా భారత్.. అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల్లో మూడో స్థానం

ప్రపంచంలో అత్యధిక బిలీయనీర్లు ఉన్న దేశాల్లో భారత మూడో స్థానంలో నిలిచింది. గడచిన కొన్నాళ్లుగా దేశంలో సంపద పెరుగుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యు బి ఎస్ ఏడాదికి గాను విడుదల చేసిన బిలినియర్ యాంబిషన్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో 185 మంది బిలియనీర్లు ఉన్నారు. 835 మంది బిలీయనీర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా 427 మందితో రెండో స్థానంలో నిలిచింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలో అత్యధిక బిలీయనీర్లు ఉన్న దేశాల్లో భారత మూడో స్థానంలో నిలిచింది. గడచిన కొన్నాళ్లుగా దేశంలో సంపద పెరుగుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యు బి ఎస్ ఏడాదికి గాను విడుదల చేసిన బిలినియర్ యాంబిషన్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో 185 మంది బిలియనీర్లు ఉన్నారు. 835 మంది బిలీయనీర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా 427 మందితో రెండో స్థానంలో నిలిచింది. కనీసం 100 కోట్ల డాలర్ల (రూ.8,465 కోట్లు) వ్యక్తిగత సంపద కలిగిన వారిని బిలీయనీర్ గా గుర్తిస్తారు. భారతదేశంలో ఈ ఏడాదిలో కొత్తగా 32 మంది బిలియనీర్లు అవతరించారు. గడిచిన ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 21 శాతం పెరిగింది. 2017తో పోలిస్తే 123% వృద్ధి నమోదయింది. దేశంలోని ప్రస్తుత బిలియనీర్ల మొత్తం సంపద గడిచిన ఏడాది కాలంలో 42.1% ఏక బాకీ 90,560 కోట్ల డాలర్లకు (దాదాపుగా 76.66 లక్షల కోట్లు) చేరుకుందని యుబిఎస్ వెల్లడించింది. రానున్న దశాబ్ద కాలంలో భారతలోని బిలీనియర్ల సంఖ్య మరింత పెరుగుతుందని ఈ సంస్థ నివేదికలో వెల్లడించింది. భారత ఆర్థిక పరివర్తనంలో కుటుంబ వ్యాపారాలు కీలకపాత్ర పోషించాయని ఈ సంస్థ పేర్కొంది. దేశంలో 108 కుటుంబ వ్యాపారాలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయని, లిస్టెడ్ కుటుంబ వ్యాపారాలు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశాల్లో భారత్ ఒకటనే యుబిఎస్ వెల్లడించింది.

తాజా నివేదిక ప్రకారం భారత దేశంలో బిలియనీర్ల సంఖ్య రానన్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ రంగ నిపుణులు, ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు 2017లో 1757 మంది ఉండగా, 2024లో ఈ సంఖ్య 2,682 కు చేరుకుంది. బిలియనీర్ల మొత్తం సంపద విలువ గడచిన పదేళ్లలో 6.3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 14 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంది. అంటే ఏటా వీరి సంఖ్య పది శాతం చొప్పున పెరిగింది. గడిచిన ఏడాది కాలంలో అమెరికాలో కొత్తగా 84 మంది బిలీయనీర్లు అవతరించగా, చైనాలో వీరి సంఖ్య 93 తగ్గింది. అమెరికా కుబేరులు మొత్తం సంపద 4.6 లక్షల కోట్ల డాలర్ల నుంచి 5.8 లక్షల కోట్ల డాలర్లకు పెరగగా, చైనా బిలియనీర్ల  సంపద 1.8 లక్షల కోట్ల డాలర్ల నుంచి 1.4 లక్షల కోట్ల డాలర్లకు పడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 1877 మంది స్వయంకృషితో ఎదిగిన వారు కాగా, 805 మందికి ఆస్తి వారసత్వంగా సంక్రమించింది. గడిచిన దశాబ్ద కాలంలో టెక్ బిలియనీర్ల సంపద శరవేగంగా పెరుగుతూ వస్తోంది. 2017 లో వీరి మొత్తం సంపద 78,890 కోట్ల డాలర్లు కాగా, 2020 నాటికి మూడింతలై 2.4 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. పారిశ్రామిక బిలియనీర్ల మొత్తం సంపద 48,040 కోట్ల డాలర్ల నుంచి 1.3 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. మెటీరియల్స్ రంగ బిలియనీర్ల వెల్త్ 71,810 కోట్ల డాలర్ నుంచి 1.8 లక్షల కోట్ల డాలర్లకు ఏగబాకింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్