దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గిపోతోంది. ఆదివారం ఆందోళనకర రీతిలో గాలి నాణ్యత తగ్గిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. రెండు రోజుల కిందటి వరకు 400 దాటిన ఏక్యూఐ ఆదివారం 500 దాటేసింది. ఇది ఢిల్లీ - ఎన్ సి ఆర్ పరిధిలో నివసించే ప్రజల ఆరోగ్యానికి అత్యంత హానిని కలిగించే పరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు.
కాలుష్య కోరల్లో ఢిల్లీ నగరం
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గిపోతోంది. ఆదివారం ఆందోళనకర రీతిలో గాలి నాణ్యత తగ్గిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. రెండు రోజుల కిందటి వరకు 400 దాటిన ఏక్యూఐ ఆదివారం 500 దాటేసింది. ఇది ఢిల్లీ - ఎన్ సి ఆర్ పరిధిలో నివసించే ప్రజల ఆరోగ్యానికి అత్యంత హానిని కలిగించే పరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు. దీపావళి పండుగ తర్వాత దేశంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత తగ్గింది. భారీ ఎత్తున టపాసులు కాల్చడంతో ఢిల్లీలో కూడా గాలి నాణ్యత తగ్గిపోయింది. కాలుష్యం పెరిగిపోవడంతో గాలిలోని ధూళికణాలు భారీగా పెరిగిపోయినట్లు వెల్లడైంది. ఆదివారం అనూహ్యంగా గాలి నాణ్యత తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తుంది. గాలి నాణ్యత తగ్గిన విషయాన్ని ఐక్యుఏఐఆర్ వెబ్సైట్ వెల్లడించింది. దీని ప్రకారం ఢిల్లీలో ఆదివారం ఉదయం గాలి నాణ్యత 507 కు పడిపోయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధారించిన ప్రమాణాలు ప్రకారం పీఎం 2.5 నిర్ణీత పరిధి కంటే 65 రెట్లు పడిపోయినట్లు వెల్లడవుతోంది.
సాధారణంగా గాలి నాణ్యత ఏక్యూఐ 200 నుంచి 300 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగాలేదని అర్థం. 300 నుంచి 400 మధ్య ఉంటే కాలుష్యం పెరిగినట్లు. 400 నుంచి 500 వరకు ఉంటే మాత్రం ప్రాణాంతకంగా భావించాల్సి ఉంటుంది. ఆదివారం ఢిల్లీలో 500 కు మించి ఉండడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోవడం పట్ల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఐదు గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) 500 పాయింట్లుకు చేరిపోయింది. కేవలం 12 గంటల వ్యవధిలోనే గాలి కాలుష్యం రికార్డు స్థాయికి చేరిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు గాలి కాలుష్యంతో పాటు ఢిల్లీ నగరం మొత్తం దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలోని ఆనంద్ విహార వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 500 కంటే ఎక్కువగా ఏక్యూఐ నమోదు కావడం గమనార్హం. గాలి నాణ్యత పూర్తిగా తగ్గిపోవడం వలన కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో నాణ్యత తగ్గిన గాలిని పీల్చడం వల్ల ప్రజలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.